SmartPhone Sell: మీ ఫోన్ ని అమ్మేటప్పుడు ఈ 5 విషయాలు మర్చిపోయారంటే మీ సీక్రెట్స్ లీక్ అవ్వడం ఖాయం?

మామూలుగా మనం స్మార్ట్ ఫోన్ సరిగా వర్క్ చేయనప్పుడు లేదంటే కొత్త ఫోన్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మన స్మార్ట్ ఫోన్ అమ్ముతూ ఉంటాం. లేదా స్మార్ట్

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 03:10 PM IST

మామూలుగా మనం స్మార్ట్ ఫోన్ సరిగా వర్క్ చేయనప్పుడు లేదంటే కొత్త ఫోన్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మన స్మార్ట్ ఫోన్ అమ్ముతూ ఉంటాం. లేదా స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. అలా చేసుకోవడం మంచిదే కానీ మీ ఫోన్ ని అమ్మేటప్పుడు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఐదు రకాల విషయాలను గుర్తుంచుకోకపోతే మీకు ఆర్థిక నష్టంతో పాటు మీ వ్యక్తిగత విషయాలు మీ ప్రైవేట్ ఫొటోస్ అన్నీ కూడా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫోన్ అమ్మడానికి వీటికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా! మరి వాటి మధ్య సంబంధం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీ పాత ఫోన్‌ను అమ్మే ముందు, మీరు మీ ఫోన్ నుంచి అన్ని బ్యాంకింగ్ యాప్‌ లను తొలగించాలి. ఈ యాప్‌లు మొబైల్ నంబర్‌కు లింక్ అవుతాయి. వీటిని డిలీట్ చేస్తే మీకు ఓటీపీ రాదు. ఇలా చేస్తే యాప్‌లో మీకు సంబంధించిన డేటా అపరిచితులకు చేరకుండా చేసినట్లవుతుంది. అలాగే మీరు అమ్మాలి అనుకుంటున్నా ఫోన్ లో మీ కాల్ రికార్డులు, సందేశాలను ఫోన్ నుంచి తొలగించాలి. వాటిని బ్యాకప్‌ గా దాచుకోవాలనుకుంటే గూగుల్ డ్రైవ్ యాప్‌‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులో సేవ్ చేసుకోవచ్చు. అందులో 15జీబీ వరకూ ఉచితంగా దాచుకునే వీలు ఉంటుంది. గూగుల్ డ్రైవ్‌లో దాచిన తర్వాత ఆ యాప్‌ని కూడా డిలీట్ చెయ్యవచ్చు.

కొత్త మొబైల్ కొన్నాక, అందులో గూగుల్ డ్రైవ్ యాప్ వేసుకొని, తద్వారా మీ బ్యాకప్ కాల్ రికార్డులు, సందేశాలను తిరిగి పొందవచ్చు. అలాగే మీ మల్టీమీడియా ఫైల్‌లను గూగుల్ ఫొటోలు, గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ లేదా ఏదైనా ఇతర క్లౌడ్ సర్వీస్ ద్వారా బ్యాకప్ చేసుకోవచ్చు. లేదంటే, మీరు వేరే ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, SD కార్డ్ వంటి వాటిలో బ్యాకప్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని పూర్తిగా మొబైల్ నుంచి తొలగించాలి. స్మార్ట్‌ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల ఫోన్‌లోని మొత్తం డేటా పోతుంది. ఫోన్ కొన్న కొత్తలో ఎలా ఉందో, అలా ఉంటుంది. గూగుల్ అకౌంట్లు స్వయంగా తొలగిపోతాయన్న గ్యారెంటీ లేదు.

అందువల్ల ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి ముందు, అన్ని అకౌంట్ల నుంచి మాన్యువల్‌గా లాగ్ అవుట్ అవ్వడం మంచిది. ఫోన్‌ని ఫ్యాక్టరీ రీసెట్ చేసి, అమ్మే ముందు, మీరు వాట్సాప్ బ్యాకప్ చేసుకోండి. లేదంటే మీ అన్ని చాట్‌లూ, ఇతర డేటా కొత్త ఫోన్‌లో అందుబాటులో ఉండవు. బ్యాకప్ చేసుకోవడం వల్ల, కొత్త ఫోన్‌లో వాట్సాప్ బ్యాకప్‌ని తిరిగి తెచ్చుకోవచ్చు. కాబట్టి మీ స్మార్ట్ ఫోన్ ని ఇతరులకు అమ్మాలి అనుకునేటప్పుడు పైన చెప్పిన ఐదు విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.