Site icon HashtagU Telugu

WordPad Removed : ‘వర్డ్‌ప్యాడ్‌’ గుడ్ బై.. 30 ఏళ్ల జర్నీకి ముగింపు పలికిన మైక్రోసాఫ్ట్‌

Wordpad Removed

Wordpad Removed

WordPad Removed :  మైక్రోసాఫ్ట్ చెందిన ‘వర్డ్‌ప్యాడ్‌’ టూల్ త్వరలోనే మనకు గుడ్ బై చెప్పబోతోంది. ‘వర్డ్‌ప్యాడ్‌’ కు అప్ డేట్స్ ఇవ్వడం ఆపేసి, కొన్నాళ్ల తర్వాత పూర్తిగా రిమూవ్ చేస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.  ఫ్యూచర్ లో లాంఛ్ చేసే విండోస్‌ వెర్షన్లలో ‘వర్డ్‌ప్యాడ్‌’ ఉండదని ప్రకటించింది. వర్డ్ ప్యాడ్ కు అప్‌డేట్‌ వెర్షన్‌ ను కూడా రిలీజ్ చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. వర్డ్ ప్యాడ్ స్థానంలో ‘మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌’ను ఉపయోగించుకోవాలని యూజర్స్ కు సూచించింది. సరికొత్త ఆప్షన్లతో ‘నోట్‌ప్యాడ్‌’ అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ ను విడుదల చేసిన మైక్రో సాఫ్ట్.. ఆ మరుసటి రోజే వర్డ్ ప్యాడ్ ను డిస్ కంటిన్యూ చేస్తున్నట్టుగా ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

Also read : Telangana: తెలంగాణకు 30 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

30 ఏళ్ల క్రితం విండోస్‌ 95తో పరిచయమైన ‘వర్డ్‌ప్యాడ్‌’ వరల్డ్ ఫేమస్ (WordPad Removed) అయింది. దాన్ని కోట్లాది మంది నిత్యం వినియోగిస్తున్నారు. డాక్యుమెంట్‌ రైటింగ్‌ కోసం దీన్ని ఎక్కువగా  వాడుతుంటారు. ఇటీవల Windows 11లో డిజిటల్ అసిస్టెంట్ యాప్ Cortanaను మైక్రోసాఫ్ట్ మూసేసింది. Windowsలో ఒక స్వతంత్ర యాప్‌గా ఉన్న Cortanaను ఆపేసినప్పటికీ.. ఈ ఏడాది చివరివరకు Teams mobile, Microsoft Teams display, Microsoft Teamsలలో Cortana యాప్ పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.