Mi Clearance Sale: రెడ్ మీ బంపర్ ఆఫర్.. ఆ స్మార్ట్ ఫోన్స్ అన్నీ సగం ధరకే?

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ రెడ్ మీ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. రెడ్ మీ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 05:34 PM IST

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ రెడ్ మీ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. రెడ్ మీ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్ ఫోన్ లను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. అంతేకాకుండా వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా రెడ్ మీ సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది.

కాగా రెడ్‌మీ పేరెంట్‌ కంపెనీ ఎంఐ క్లియరెన్స్‌ సేల్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌ అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ లను అందిస్తోంది. కాగా ఈ సేల్‌లో కొనుగోలుదారులు రూ. 3,999కే స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చట. ఎంఐ క్లియరెన్స్ సేల్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ లో పొందుపరిచింది. దీంతో రెడ్ మీ 6ఏ, రెడ్ మీ వై3, రెడ్ మీ నోట్ 7 ప్రో లాంటి వంటి మోడల్స్ ను దాదాపు సగం ధరకు కొనుగోలు చేయవచ్చు.

కాగా రెడ్ మీ 6ఏ మోడల్ ప్రారంభ ధర రూ.6,999 కాగా, క్లియరెన్స్ సేల్ లో ఈ మొబైల్ కేవలం రూ. 3,999 కే అందుబాటులో ఉంది. అలాగే ప్రాథమిక ఫీచర్ లతో 2జీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ తో వచ్చిన బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్ రెడ్‌మీ 6ఏ, దీంతోపాటు మిగతా మోడళ్లను కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి. అయితే వినియోగదారులు ఈ సేల్ తగ్గింపు విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఫీల్ తగ్గింపుతో కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్ లు వారంటీని కలిగి ఉండవు.