FB Live – Smart Glasses : స్మార్ట్ గ్లాసెస్ తో ఫేస్ బుక్ లైవ్.. ‘మెటా రే-బాన్ స్టోరీస్ -2’ విశేషాలివిగో..

FB Live - Smart Glasses : స్మార్ట్ గ్లాసెస్ తో సోషల్ మీడియా విప్లవం సృష్టించే దిశగా ఫేస్ బుక్ (మెటా) వేగంగా అడుగులు వేస్తోంది. 

  • Written By:
  • Updated On - August 26, 2023 / 11:16 AM IST

FB Live – Smart Glasses : స్మార్ట్ గ్లాసెస్ తో సోషల్ మీడియా విప్లవం సృష్టించే దిశగా ఫేస్ బుక్ (మెటా) వేగంగా అడుగులు వేస్తోంది. 

వాటిలో అట్రాక్టివ్ ఫీచర్స్ ను జోడించేందుకు కసరత్తు చేస్తోంది.

అక్టోబరులో మార్కెట్ లోకి రిలీజ్ కానున్న ‘మెటా రే-బాన్ స్టోరీస్ -2’ స్మార్ట్ గ్లాసెస్ లో ఉండే ఫీచర్స్ పై ఓ లుక్ వేద్దాం.. 

Also read : Vivek Venkataswamy : కాంగ్రెస్ పార్టీ లోకి వివేక్ వెంకటస్వామి..?

రెండోతరం మెటా రే-బాన్ స్టోరీస్ స్మార్ట్ గ్లాసెస్ ను వినియోగించి నెటిజన్స్ ఈజీగా ఫేస్ బుక్  లైవ్ స్ట్రీమింగ్ ను చేయొచ్చు. ఈ స్మార్ట్ కళ్లద్దాలు పెట్టుకోవడం వల్ల ఫేస్ బుక్ వీడియో కంటెంట్ క్రియేటర్స్ .. వీక్షకుల మధ్య చాలా మెరుగైన పాయింట్ ఆఫ్ వ్యూ (PoV) కుదురుతుంది. ముఖ్యంగా నడిచేటప్పుడు, సంగీత కచేరీల్లో ఉన్నప్పుడు ఇది చాలా యూజ్ ఫుల్ గా ఉంటుంది. మొదటితరం మెటా  రే-బాన్ స్టోరీస్ స్మార్ట్ గ్లాసెస్ తో పోల్చుకుంటే  వీటిలో..  వీడియో స్ట్రీమింగ్ ఫంక్షన్‌ను ఎనేబుల్ చేయడానికి బ్యాటరీ బ్యాకప్‌ను మరింత మెరుగుపరిచారు. అంతేకాదు లైవ్ స్ట్రీమ్ జరుగుతుండగా వ్యూయర్స్.. వీడియో క్రియేటర్ తో ఛాట్ కూడా చేయొచ్చు. లైవ్ లోనే కాంటాక్ట్ కావచ్చు. వ్యూయర్స్ కూడా వీడియో క్రియేటర్ తో మాట్లాడొచ్చు అని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Also read : Kia Sonet Facelift: అత్యాధునిక హంగులతో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్.. ధర ఎంతంటే..?

అయితే లైవ్ స్ట్రీమ్ అవుతున్న సమయంలో క్రియేటర్‌తో నేరుగా కమ్యూనికేట్ కావడానికిగానూ వినియోగదారుల కోసం ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్ ను (FB Live – Smart Glasses) ఫేస్ బుక్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంటే..  కొంత పేమెంట్ చేసి లైవ్ కంటెంట్ చేసే వారితో ఛాట్ చేయొచ్చన్న మాట. ఇలాంటి సబ్ స్క్రిప్షన్ ప్లాన్ రూపంలో వచ్చే ఆదాయంలో కొంతభాగాన్ని కంటెంట్ క్రియేటర్ కు కూడా ఫేస్ బుక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. ఈ స్మార్ట్ గ్లాసెస్ లోపలే ఇన్ బిల్ట్ హెడ్‌ఫోన్‌ లు, మైక్ లు, స్పీకర్లు  కూడా ఉంటాయి. రెండోతరం మెటా రే-బాన్ స్టోరీస్ స్మార్ట్ గ్లాసెస్ లో ఆడియో క్వాలిటీని కూడా బాగా ఇంప్రూవ్ చేశారట. మొదటి తరం మెటా స్మార్ట్ గ్లాసెస్‌లో ఎల్‌ఈడీ ఇండికేటర్‌లు ఉండేవి. కొత్తగా రాబోయే రెండోతరం స్మార్ట్ గ్లాసెస్ లో ఎల్‌ఈడీ ఇండికేటర్‌లను కంటెంట్ క్రియేటర్ హైడ్ చేసే ఆప్షన్ ఉంది. దీన్ని అక్టోబరులో మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అదే నెలలో ‘క్వెస్ట్ 3 మిక్స్డ్-రియాలిటీ హెడ్‌సెట్‌’  కూడా  లాంచ్ కాబోతోంది.  ఈ సంవత్సరం యాపిల్ కంపెనీ సైతం విజన్ ప్రో హెడ్‌సెట్‌తో ఈ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.