Llama 2 AI Chatbot  : చాట్ జీపీటీ, బార్డ్ కు పోటీగా “లామా 2”.. జుకర్ బర్గ్ మరో ఆవిష్కరణ 

Llama 2 AI Chatbot : OpenAI యొక్క  చాట్ జీపీటీ (Chat GPT).. Google యొక్క బార్డ్ (Bard) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  చాట్‌బాట్‌లకు పోటీ ఇచ్చేటందుకు ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా (Meta) కూడా రెడీ అయింది. 

  • Written By:
  • Updated On - July 19, 2023 / 08:42 AM IST

Llama 2 AI Chatbot : OpenAI యొక్క  చాట్ జీపీటీ (Chat GPT).. Google యొక్క బార్డ్ (Bard) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  చాట్‌బాట్‌లకు పోటీ ఇచ్చేటందుకు ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా (Meta) కూడా రెడీ అయింది. 

ఇందుకోసం లామా 2 (Llama 2) పేరుతో ఓపెన్ సోర్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)  మోడల్ ను రిలీజ్ చేసింది. 

ChatGPT, Bardల కంటే 40 శాతం ఎక్కువ డేటాతో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత లామా 2ను రిలీజ్ చేశామని మెటా వెల్లడించింది. లామా 2 ఏఐ మోడల్ ద్వారా మరింత నాణ్యమైన సెర్చ్ రిజల్ట్స్ పొందొచ్చని తెలిపింది. దీని  ద్వారా వచ్చే సెర్చ్ రిజల్ట్స్ ను మరింత బెటర్ చేసేందుకు మనుషుల నుంచి సేకరించిన 10 లక్షల కంటే ఎక్కువ మెటా డాటాను “లామా 2” ఏఐ మోడల్ లో పొందుపరిచామని వివరించింది. 

Also read : BRS vs Congress : రైతుల‌కు రేవంత్ క్ష‌మాప‌ణ చెప్పాలి : రాజ్య‌స‌భ స‌భ్యుడు వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌

“లామా 2” ఏఐ మోడల్ ను(Llama 2 AI Chatbot) మైక్రోసాఫ్ట్ కు చెందిన అజూర్ క్లౌడ్ సర్వీస్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని మెటా తెలిపింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇది రన్ అవుతుందని వెల్లడించింది. లామా 2 ఏఐ మోడల్ ను జనంలోకి తీసుకెళ్లడంలో మైక్రోసాఫ్ట్‌ తమ ప్రధాన భాగస్వామిగా ఉంటుందని చెప్పింది. ఇంతకుముందు వరకు  పరిశోధనా ప్రయోజనాల కోసం ఎంపిక చేసిన విద్యావేత్తలకు మాత్రమే “లామా 2” ఏఐ మోడల్ ను మెటా అందించేది. ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీన్ని మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సర్వీస్ తో పాటు అమెజాన్ వెబ్ సేవలు, హగ్గింగ్ ఫేస్, ఇతర ప్రొవైడర్ల ద్వారా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. “లామా 2 అనేది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  చాట్‌బాట్‌ రంగపు  ముఖచిత్రాన్ని మార్చగలదు” అని ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు.

Also read : US- North Korea: ఉత్తర కొరియా, అమెరికా మధ్య ఉద్రిక్తత.. అనుమతి లేకుండా ఉత్తర కొరియా సరిహద్దులోకి ప్రవేశించిన అమెరికా పౌరుడు..!