Site icon HashtagU Telugu

Whatsapp: వాట్సాప్ లో కొత్తగా బ్లూ కలర్ రౌండ్ ఆప్షన్.. దీని ఉపయోగం ఏంటో తెలుసా?

Mixcollage 03 Jul 2024 12 07 Pm 3771

Mixcollage 03 Jul 2024 12 07 Pm 3771

ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ ఫోన్ ని వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. ఇక రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా అందుకు అనుగుణంగానే కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫ్యూచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన వాట్సాప్ సంస్థ ఇటీవల కాలంలో ఒకదాని తరువాత ఒకటి వరుసగా ఫీచర్లను అందిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల నుంచి వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

ఇంతకీ ఆ ఫీచర్ ఏది దాని వల్ల ఇలాంటి ఉపయోగం అన్న వివరాల్లోకి వెళితే.. వాట్సాప్‌ ఓపెన్‌ చేయగానే పక్కన బ్లూ పర్పుల్ రౌండ్ రింగ్ కనిపిస్తుంది. ఇది ఎందుకని మీరెప్పుడైనా గమనించే ఉంటారు. మరి దీని వల్ల ఉపయోగం ఏమిటి? ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అన్న వివరాల్లోకి వెళితే.. వాట్సాప్‌ ను కలిగి ఉన్న మెటా అనే సంస్థ మీ ప్రయోజనం కోసం ప్రత్యేక ప్రయోజనాలను తీసుకువచ్చింది. ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది అన్న వివరాల్లోకి వెళితే.. ముందుగా మీరు వాట్సాప్ లో ఉన్న ఆ రౌండ్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ముందు చాట్‌బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు AIని ప్రాంప్ట్ చేస్తారు. AI మీ ప్రశ్నలకు వీలైనంత ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది.

మీరు కాశ్మీర్ అద్భుతమైన అందాన్ని చూడాలి అనుకుంటే అప్పుడు మీరు Meta AI చాట్‌బాక్స్‌లో బ్యూటిఫుల్ కాశ్మీర్ వ్యాలీ ఇమేజెస్‌లో ఇస్తుంది. AI మీకు ఆ చిత్రాన్ని తక్షణమే చూపుతుంది. మీరు ఈ చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసి ఉపయోగించవచ్చు. మీరు చూడాలనుకుంటున్న ప్రదేశాలు ఏ వంట ఎలా చేయాలి? తదితర అంశాలపై ప్రశ్నల అడిగినా కూడా క్షణాల్లోనే సమాధానం ఇస్తుంది. ఇలా ఉపయోగించుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి. ఈ రోజుల్లో పనిని సులభతరం చేయడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నారు.

మీరు ఎప్పుడైనా ఏదైనా సమాచారాన్ని తెలుసుకోవాలి లేదా మీ రోజువారీ పనిలో ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి, మీరు Meta AIని ఉపయోగించి తక్షణమే దాన్ని చేయవచ్చు. దీని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు ప్రత్యేక AI ప్లాట్‌ఫారమ్‌ను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మీరు Meta AIని ఉపయోగించడానికి సబ్‌స్క్రిప్షన్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం, మీరు ఇంస్టాగ్రామ్,వాట్సాప్ లో మెటా AIని ఉపయోగించవచ్చు. మీకు మీ ఫోన్‌లో ఈ ఆప్షన్ కనిపించకపోతే ప్లే స్టోర్ నుండి వాట్సాప్ ని అప్‌డేట్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా Meta AI కనిపిస్తుంది.