Facebook : మెటా (ఇండియా) చీఫ్ అజిత్ మోహన్ రాజీనామా…స్నాప్ చాట్ లో చేరిక..!!

  • Written By:
  • Publish Date - November 4, 2022 / 04:47 AM IST

ఫేస్ బుక్ ఇండియా హెడ్ పదవికి రాజీనామా చేశారు అజిత్ మోహన్. రాజీనామా అనంతరం కీలక ప్రకటన చేశారు. తాను స్నాప్ చాట్ చేరబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ పరిమాణంపై మెటాలోని గ్లోబల్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నికోలా మెండెల్సన్ స్పందించారు. అజిత్ మోహన్ తాను కొత్త అవకాశాల కోసం మెటాలోని తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.

గత నాలుగేళ్లుగా అజిత్ మోహన్ ఫేస్ బుక్ ఇండియాకు సేవలందించారు. ఫేస్ బుక్ డెవలప్ మెంట్ లో కీలక పాత్ర పోషించారు. దీంతో అనేక మిలియన్ల భారతీయ వ్యాపారాలు, భాగస్వాములకు ప్రజలకు సేవలందించారు. మేము భారత్ పట్ల నిబద్ధతతో ఉన్నాం. అజిత్ నాయకత్వానికి కృతజ్ఞత తెలుపుతున్నాం. భవిష్యత్తు కోసం అజిత్ మోహన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామంటూ మెండెల్సోన్ ఓ లేఖలో పేర్కొన్నారు.

జనవరి 2019లో ఫేస్‌బుక్ ఇండియా అజిత్ మోహన్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. అతని పదవీకాలంలో, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ భారతదేశంలో 200 మిలియన్లకు పైగా వినియోగదారులకు సేవలందించాయి. మోహన్ Facebook మొత్తం వ్యూహాన్ని భారతదేశంలో పెట్టుబడులను కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. అజిత్ మెహన్ మెకిన్సే అండ్ కంపెనీ న్యూయార్క్ ఆఫీస్ పూర్వ విద్యార్థి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా కంపెనీలతో కలిసి పనిచేశాడు. మోహన్ భారతదేశంలోని ప్రముఖ ప్రీమియం వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో స్టార్ ఇండియా ఓవర్-ది-టాప్ (OTT) సర్వీస్‌ను ప్రారంభించారు. అజిత్ మోహన్
జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (SAIS) పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వార్టన్ స్కూల్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు.