Meta – Google – Microsoft : నకిలీ పొలిటికల్ కంటెంట్‌‌‌పై పోరు.. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ జట్టు

Meta - Google - Microsoft : ఈ ఏడాది భారత్, అమెరికా సహా చాలా ప్రపంచ దేశాలలో ఎన్నికలు జరగనున్నాయి.

  • Written By:
  • Updated On - February 14, 2024 / 08:21 AM IST

Meta – Google – Microsoft : ఈ ఏడాది భారత్, అమెరికా సహా చాలా ప్రపంచ దేశాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో మెటా (ఫేస్‌బుక్), మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓపెన్‌ఏఐ, అడోబ్, టిక్‌టాక్ సహా టెక్ దిగ్గజాలన్నీ కలిసికట్టుగా ఒక  ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి.  ఓటర్లను మోసం చేసేందుకు తయారుచేసే ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (AI) ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, జిఫ్‌లతో నకిలీ పొలిటికల్ కంటెంట్‌ను అరికట్టడానికి ఏకతాటిపైకి రానున్నాయి.  ఇలాంటి తప్పుడు కంటెంట్‌‌కు కలిసికట్టుగా కళ్లెం వేయడానికి ఈ టెక్ దిగ్గజ సంస్థలన్నీ ఒక సంయుక్త ఒప్పందం కుదుర్చు కోనున్నాయి.  ప్రస్తుతం దీనిపై  మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓపెన్‌ఏఐ, అడోబ్, టిక్ టాక్ సహా టెక్ దిగ్గజాలన్నీ చర్చలు జరుగుతున్నాయి. ‘‘డీప్‌ఫేక్‌లు, ఇతర ప్రమాదకరమైన కంటెంట్‌ కట్టడి’’ అనే పేరుతో కుదుర్చుకోనున్న ఈ ఒప్పందం(Meta – Google – Microsoft) వివరాలను శుక్రవారం రోజు  జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా జరిగే సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

కీలక ప్రకటన చేసిన మెటా

‘‘ప్రపంచ దేశాల ఎన్నికల కోలాహలం ఉండబోయే క్లిష్టమైన సంవత్సరం ఇది. ఈ టైంలో ఓటర్లను లక్ష్యంగా చేసుకుని మోసపూరిత  AI  కంటెంట్ వ్యాప్తి జరగకుండా నిరోధించేందుకు టెక్ కంపెనీలు, సోషల్ మీడియా సంస్థలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి’’ అని మెటా ప్రతినిధి తెలిపారు. ఏఐ డీప్ ఫేక్ వీడియోలు హల్ చల్ చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. Meta, Google, OpenAI ఇప్పటికే తమ AI అప్లికేషన్‌లను తీసుకొచ్చాయి. OpenAIకి ChatGPT, Microsoftకి Copilot, Googleకి జెమిని ఛాట్ బాట్‌లు ఉన్నాయి.

Also Read : PM Modi – UAE : అబుధాబిలో మోడీ ఎమోషనల్ స్పీచ్.. ‘భారత్-యూఏఈ దోస్తీ జిందాబాద్’

బైడెన్‌కు షాక్

గత నెలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గొంతుతో ఫేక్ ఆడియో క్లిప్‌ను కొంతమంది వైరల్ చేయడం దుమారం రేపింది. ‘‘న్యూ హాంప్‌షైర్‌లో జరగబోయే డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికలో నాకు ఎవరూ  ఓటు వేయొద్దని కోరుతున్నాను’’ అని బైడెన్ చెబుతున్నట్లుగా ఆ ఆడియోలో ఉంది. ఈ ఆడియో క్లిప్ వేలాది మందికి సర్క్యులేట్ అయ్యాక అమెరికా మీడియా ద్వారా వార్తల్లోకి వచ్చింది. ఈ ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్న బైెడెన్‌కు ఈ పరిణామం షాకిచ్చింది.

ఇమ్రాన్ ఖాన్ ఏఐ స్పీచ్

ఇటీవల పాకిస్తాన్ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ భారీగా జాతీయ అసెంబ్లీ సీట్లను గెల్చుకుంది. ఆ వెంటనే ఇమ్రాన్ ఖాన్ ఏఐ ప్రసంగాన్ని ఆయన పార్టీ వర్గాలు ట్విట్టర్ వేదికగా విడుదల చేసి సంచలనం క్రియేట్ చేశాయి.