Whatsapp: 26 లక్షల బ్యాడ్ అకౌంట్స్ బ్యాన్.. ఇందులో మీ అకౌంట్ కూడా ఉందేమో చూసుకోండి?

గత ఏడాది భారత్ లో కొత్త ఐటీ రూల్స్ లను రూపొందించిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఈ రూల్స్ అమల్లోకి

  • Written By:
  • Publish Date - November 3, 2022 / 03:30 PM IST

గత ఏడాది భారత్ లో కొత్త ఐటీ రూల్స్ లను రూపొందించిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఈ రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ నుంచి తప్పుడు పనులు చేస్తున్న అకౌంట్స్ వరకు అందరికీ షాక్ తగులుతోంది. ఇకపోతే 2021 కొత్త ఐటి రూల్స్ ప్రకారం మెటాసెప్టెంబర్‌ లో 26 లక్షల వాట్సాప్ అకౌంట్స్ ని నిషేధించిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా భారత్లో దాదాపుగా 50 కోట్లకు పైగా వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

సెప్టెంబర్ నెలలో వాట్సాప్ విషయంలో 666 కంప్లైంట్స్ రావడంతో 23 ఫిర్యాదులపై చర్యలు తీసుకుంది వాట్సాప్ సంస్థ. ఈ నేపథ్యంలోనే కొత్త ఐటి రూల్స్ కి అనుగుణంగా లేని 26 లక్షల వాట్సాప్ అకౌంట్ లను బ్యాన్ చేసింది. అలాగే ఈ ఏడాది ఆగస్టులో 23 లక్షల వాట్సాప్ బ్యాడ్ అకౌంట్స్ ని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా 26 లక్షల అకౌంట్స్ ని బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం మేము సెప్టెంబర్ 22లో నెలలో మా నివేదికను ప్రచురించాము. వినియోగదారుల నుంచి స్వీకరించబడిన ఫిర్యాదులు వాట్సాప్ తీసుకున్న చర్యల వివరాలు వినియోగదారుల భద్రత నివేదికలో ఉన్నట్టు తెలిపింది వాట్సాప్ సంస్థ.

అలాగే మా ప్లాట్ ఫామ్ లో దుర్వినియోగాన్ని ఎదుర్కొనడానికి వాట్సాప్ సొంత నివారణ చర్యలు తీసుకుంది అని వాట్సాప్ సంస్థ యొక్క అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో మధ్యవర్తులు హానికరమైన అలాగే చట్టానికి విరుద్ధమైన కంటెంట్ అప్లోడ్ చేయకూడదని యూజర్లకు తెలిపింది వాట్సాప్ సంస్థ. అదేవిధంగా అటువంటి కంటెంట్లను అప్లోడ్ చేయకుండా వినియోగదారులు నిరోధించడం కోసం ప్రయత్నాలు చేసే విధంగా మధ్య వ్యక్తులపై చట్టపరమైన బాధ్యతలను తీసుకునేలా సవరణలు జారీ చేసింది ప్రభుత్వం.