Whatsapp: వాట్సాప్‌లో మీ నెంబర్‌కి మీరే మెసేజ్ పంపించుకోవచ్చు.. ఎలా అంటే?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం

  • Written By:
  • Publish Date - November 23, 2022 / 03:35 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాట్సాప్ కి సంబంధించిన మరొక ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేమిటంటే మీ నెంబర్ నుంచి మీ నెంబర్ కి మీరే మెసేజ్ చేసుకోవచ్చు. రెండు పద్ధతుల ద్వారా మీ నెంబర్ నుంచి మీ నెంబర్ కి మెసేజ్లు చేసుకోవచ్చట. మరి ఆ రెండు పద్ధతులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందులో మొదటి పద్ధతి విషయానికి వస్తే.. వాట్సాప్ ఓపెన్ చేయగానే కింద కుడి వైపున చాట్స్ అనే ట్యాబ్ ఉంటుంది.

దాని మీద క్లిక్ చేస్తే న్యూ గ్రూప్, న్యూ కాంటాక్ట్, న్యూ కమ్యూనిటీ అనే ఆప్షన్స్ వచ్చినప్పుడు న్యూ కాంటాక్ట్ మీద క్లిక్ చేసి, మీ పేరు, మీ ఫోన్ నంబర్ తో కాంటాక్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత వాట్సాప్ లో మీ పేరుతో సెర్చ్ చేస్తే మీ కాంటాక్ట్ లిస్ట్ వస్తుంది.కాంటాక్ట్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు మీరే మెసేజ్ చేసుకోవచ్చు. ఈజీగా ఎటువంటి లింక్స్ నైనా, కంటెంట్ ని అయినా మీ నంబర్ కి మాత్రమే పంపించుకోవచ్చు. ఇకపోతే రెండవ పధ్ధతి విషయానికి వస్తే..

వాట్సాప్ లో మీరు, ఇంకొక వ్యక్తి పేరు మీద గ్రూప్ క్రియేట్ చేసి,ఆ తర్వాత ఆ గ్రూప్ నుంచి యాడ్ చేసిన వ్యక్తిని తొలగించండి. అంతే అప్పుడు ఆ గ్రూప్ లో మీరు ఒక్కరే ఉంటారు. కాబట్టి మీకు మాత్రమే మెసేజ్ లు పంపుకోవచ్చు. లింకులు, ఫార్వార్డ్ మెసేజులు ఇలా ఏ కంటెంట్ అయినా సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది.