Site icon HashtagU Telugu

Whatsapp Update: వాట్సాప్ లో వారికీ మాత్రమే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్.. ఎవరికంటే?

WhatsApp Edit Feature

Whatsapp Update

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వినియోగదారులు చాటింగ్ వీడియో కాల్స్ అలాగే ఇతర అవసరాల కోసం వాట్సాప్ ని ఉపయోగిస్తూనే ఉంటారు. అంతేకాకుండా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్యతో పాటు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ సంస్థ మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. వాట్సాప్ లో కొన్ని కొన్ని సార్లు మెసేజ్ తప్పుగా చేస్తూ ఉంటాం.

అలాంటప్పుడు ఎడిటింగ్ ఫీచర్ బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. మెసేజ్‌లను పంపిన తర్వాత వాటిని ఎడిట్ చేసే అవకాశం కోసం చాలా మంది వినియోగదారుల ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఫీచర్ ఈ సంవత్సరం ప్రారంభంలో వాట్సాప్ ప్రకటించినప్పటికి విస్తృత స్థాయిలో మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్‌కి యాక్సెస్ ఉన్న ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్ వాట్సాప్ వెబ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏదైనా సందేశం కోసం మెను ఎంపికల నుంచి ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు.

చాట్‌లోని ప్రతి ఒక్కరికి వాట్సాప్ తాజా వెర్షన్ ఉన్నంత వరకు సవరించిన సందేశాలు వెళ్తాయి. ఏదైనా వచన సందేశం కోసం మెనూ ఎంపికల నుంచి ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు. చాట్‌లోని ప్రతి ఒక్కరికి వాట్సాప్ తాజా వెర్షన్ ఉన్నంత వరకు సవరించిన సందేశాలు నవీకరణ అవుతాయి. వాట్సాప్ ఈ ఫీచర్‌ని సపోర్ట్ చేయని పాత వెర్షన్‌ల గడువు ముగిసినప్పుడు యూజర్లందరికీ లాంచ్ చేసే అవకాశం ఉంది. మీరు ఈ ఎంపికను ఎంచుకున్నప్పుడు సందేశాన్ని కొత్త విండోలో సవరించమని మీరు ప్రాంప్ట్ చేయబడతారు. ఒకవేళ మీ వాట్సాప్ ఖాతా కోసం ఫీచర్ ప్రారంభిస్తే మీ చాట్‌లు, సమూహాల్లో మీ సందేశాలను సవరించడానికి మీకు 15 నిమిషాల సమయం ఉంటుంది. అలాగే ఈ ఫీచర్ ద్వారా సందేశాలను అనేకసార్లు సవరించడం సాధ్యమవుతుంది. మరి మెసేజ్ ను ఎలా సవరించాలి అన్న విషయాన్ని వస్తే.. మీరు సందేశాన్ని సవరించాలనుకుంటున్న వాట్సాప్ కాంటాక్ట్‌ను ఓపెన్ చేసి, మీరు సవరించాలనుకుంటున్న సందేశాన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి. మెను నుంచి సవరించి(Edit) ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీకు కావలసిన మార్పులు చేసి, పూర్తయింది బటన్‌ను నొక్కాలి. మీ మార్పులు సేవ్ అవుతాయి. అనంతరం సవరించిన సందేశం సంభాషణలో చూపుతుంది.

Exit mobile version