జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇటీవల భారత మార్కెట్లోకి ఇక్యూఎస్ 580 4 మ్యాట్రిక్ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఎలక్ట్రిక్ కార్ ని లాంచ్ చేసిన రోజు నుంచే బుకింగ్స్ ను స్వీకరించడం మొదలు పెట్టేసింది. కాగా ఈ బుకింగ్స్ ప్రారంభమైన తేదీ నుంచి అతి తక్కువ సమయంలోనే ఈక్యూఎస్ 580 మ్యాట్రిక్ కారును అత్యధిక మంది బుకింగ్స్ చేసుకున్నారు. బాగా తాజాగా మెర్సిడెస్ బెంజ్ కంపెనీ అందించిన సమాచారం ప్రకారం..
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4 మాట్రిక్ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ కారు ను ఇప్పటికే 300 మంది బుకింగ్ చేసుకున్నారు. ఇకపోతే దేశీయం మార్కెట్లో విడుదలైన ఈ కొత్త కారు ఇతర విషయానికి వస్తే..1.55 కోట్లు (ఎక్స్ -షోరూమ్ ) అయితే ఈ సెడాన్ కారును కొనుగోలు చేయాలి అనుకునే వారు ముందుగానే 25 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుందట. ఈ కారు ఒక సింగిల్ ఛార్జ్ తోనే గరిష్టంగా 857 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది అని ధ్రువీకరించబడింది.
కాగా ఈ కారు ధర కోటికి పై మాటే అయినప్పటికీ ఈ కారు బుకింగ్స్ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ కార్ ని బుకింగ్ చేసుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక చార్జింగ్ విషయానికి వస్తే ఈ బ్యాటరీ ప్యాక్ 200 కిలో వాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో కేవలం 15 నిమిషాల్లో 300 కిలోమీటర్లు వెళ్లడానికి కావలసిన ఛార్జింగ్ పొందుతుంది. కాబట్టి ఈ కారు వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. దరకు తగ్గట్టుగానే ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ డెలివరీలు 2023 లో ప్రారంభం కానున్నాయి.