Site icon HashtagU Telugu

Iphone 12: అతి తక్కువ ధరకే యాపిల్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

iPhone SE

iPhone SE

ప్రపంచవ్యాప్తంగా యాపిల్ బ్రాండ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో చాలా మంది యాపిల్ బ్రాండ్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా యాపిల్ బ్రాండ్లో ఐఫోన్స్ కి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. యాపిల్ సిరీస్ లో కొత్త ఫోన్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి అంటే చాలు వెంటనే ఆ ఫోన్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి యాపిల్ ఫోన్ ఇష్టం ఉన్నా కూడా దాని ధరని చూసి వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో యాపిల్ సంస్థ వినియోగదారుల కోసం ఐఫోన్ ఫై భారీగా ఆఫర్స్ ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

తాజాగా మరొక ఐఫోన్ ని అతి తక్కువ ధరకే తీసుకువచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 12 రూ. 27,401 భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఐఫోన్‌12 కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. 59,900గా లిస్ట్‌కాగా, ఫ్లిప్‌కార్ట్‌తో రూ. 3,901 ధర తగ్గింపుతో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ ఈ 55,999కి లిస్ట్‌ కాగా, అయితే ప్రస్తుత ఆఫర్లతోఈ ఫోన్‌ రూ. 32,499 keలభిస్తోంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10శాతం తక్షణ తగ్గింపుతో ఐఫోన్‌ 12 ధర తగ్గింది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఐఫోన్ 12 ను కొనుగోలు చేసినట్లయితే, 5 శాతం అదనంగా క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. దీంతోపాటుగా రూ. 5,000 అంతకంటే ఎక్కువ ఆర్డర్‌ లపై రూ. 3,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది.

అలాగే పాత స్మార్ట్‌ ఫోన్‌ మార్పిడి ద్వారా ఫ్లిప్‌కార్ట్ రూ. 21,500 వరకు తగ్గింపును అందిస్తోంది. అన్ని బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్చేంజ్ ఆఫర్, డిస్కౌంట్స్‌ తరువాత 28,401 తగ్గింపుతో ఐఫోన్‌ 12 ను కేవలం రూ. 32,499తో కొనుగోలు చేయవచ్చు. యాపిల్ ఐఫోన్ 12 స్పెసిఫికేషన్స్‌ విషయానికి వస్తే.. 6.1 అంగుళాల ఓఎల్ఈడీ సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే, ఏ14 బయోనిక్ చిప్ సెట్, ఐఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టం, 64 జీబీ ర్యామ్‌128 జీబీ స్టోరేజ్‌ 12+12 డ్యుయల్‌ రియర్‌ కెమెరా, అలాగే 12 ఎంసీ ఫ్రెంట్ కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 2815 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది.