Nothing Phone: నథింగ్ స్మార్ట్ ఫోన్ 1 పై భారీగా తగ్గింపు.. కేవలం రూ.22 వేలకే?

నథింగ్‌ ఫోన్‌ ఇప్పటికే ఎన్నో రకాల ఆకర్షణీయమైన అద్భుతమైన ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి

Published By: HashtagU Telugu Desk
Nothing Phone

Nothing Phone

నథింగ్‌ ఫోన్‌ ఇప్పటికే ఎన్నో రకాల ఆకర్షణీయమైన అద్భుతమైన ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా నథింగ్ ఫోన్ టెక్నాలజీ మార్కెట్ లో తనదైన ముద్రను కూడా వేసుకుంది. కాగా బ్రిటన్ కు చెందిన ఈ సంస్థ నథింగ్ ఫోన్ 1 పేరుతో తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ప్రస్తుతం మార్కెట్ లో జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే యూకే ఆధారిత సాంకేతిక సంస్థ నథింగ్ తీసుకొచ్చిన స్మార్ట్‌ ఫోన్‌ 1 పై ఇపుడు భారీ తగ్గింపు లభిస్తోంది. ఫ్లిప్‌ కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 4,750 కి అందుబాటులో ఉంది.

128, 256 స్టోరేజ్‌ రెండు వేరియంట్లలో ప్రారంభ ధర రూ. 32,999వద్ద ఈ స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత రెండు వేరియంట్ల రేట్లను భారీగా పెంచేసింది నథింగ్ సంస్థ. నథింగ్ ఫోన్ 1 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,500 తగ్గింపుతో రూ. 27,499 వద్ద లిస్ట్‌ అయింది. అయితే ఈ ఫోన్ కి అదనంగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీ లపై 10శాతం తక్షణ తగ్గింపుతో ఈ ఫోన్ ధర మరో రూ.2,749 వరకు తగ్గవచ్చు. దీంతో పాటుగా పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఫ్లిప్కార్ట్ సంస్థ రూ. 20,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలా మొత్తం ఆఫర్లతో కలిపి ఈ ఫోన్ రూ.22,749 తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.4,750 కే నథింగ్ ఫోన్ 1 ని సొంతం చేసుకోవచ్చు.

ఇకపోతే ఈ నథింగ్ ఫోన్ 1స్పెసిఫికేషన్స్‌ విషయానికి వస్తే.. 6.55 అంగుళాల ఫుల్‌ హెచ్డీ, OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 778+ చిప్‌సెట్,1080×2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్‌ కెమెరా,16ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అలాగే 4500mAh బ్యాటరీ సామర్థం ను కూడా ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది.

  Last Updated: 14 Dec 2022, 08:48 PM IST