Site icon HashtagU Telugu

Maruti Suzuki Cars: బడ్జెట్ ధరలో మారుతీ సుజుకి కార్.. ధర, ఫీచర్స్ ఇవే?

Maruti Suzuki

Maruti Suzuki Cars

దేశవ్యాప్తంగా వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మరి ముఖ్యంగా కార్ల వినియోగదారుల సంఖ్య అయితే గణనీయంగా పెరుగుతూనే ఉంది. దీంతో ఆయా కార్ల తయారీ సంస్థలు కొత్త కొత్త మోడల్స్ లో తక్కువ ధరకే మంచి మంచి కార్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలకే కారులను తీసుకువస్తున్నారు. ఇక మార్కెట్లో ఇండియా మారుతి సుజుకి కార్లకు బాగా డిమాండ్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఎన్నో రకాల మోడల్స్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసిన మారుతి సుజుకి మరో కొత్త కార్‌ను రిలీజ్ చేసింది. టూర్ ఎస్ పేరుతో రిలీజ్ చేసింది.

మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకుంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెడాన్ విభాగంలో వచ్చిన టూర్ ఎస్ కార్లు రూ.6.50 లక్షల నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఈ కార్లు ఎస్‌టీడీ (ఓ), ఎస్‌టీడీ (ఓ) సీఎన్‌జీ వెర్షన్లతో వినియోగదారుల ముందుకు వచ్చాయి. ప్రెట్రోల్‌తో నడిచే ఎస్‌టీడీ (ఓ) ధర రూ.6.5 లక్షలుగా ఉంది. అలాగే సీఎన్‌జీ వెర్షన్ ధర రూ.7.36 లక్షలుగా ఉంది. టూర్ ఎస్ కార్ డ్యుయల్ వీవీటీ ఇంజిన్‌తో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఈ కార్లు 6000 ఆర్‌పీఎం వద్ద 89 బీహెచ్‌పీ, 4400 ఆర్‌పీఎం వద్ద 133 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అలాగే సీఎన్‌జీ వెర్షన్‌లో అయితే 6000 ఆర్‌పీఎం వద్ద 76 బీహెచ్‌పీ, 4300 ఆర్‌పీఎం వద్ద 98.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టూర్ ఎస్ కార్ లీటర్‌కు దాదాపు 23 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. అలాగే ఇందులోని సీఎన్‌జీ వెర్షన్ అయితే 32 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఎల్ఈడీ టెయిల్ లైట్లు, సెఫ్టీ టెక్ వంటి అధునాతన ఫీచర్లతో ఈ కార్ వస్తుంది. అలాగే ఈ కార్‌లో డ్యుయల్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్‌తో వచ్చే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్పీడ్ లిమిటర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ల వంటి మంచి మంచి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Exit mobile version