WhatsApp: వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్.. ఇకపై ఆ తప్పులు ఇలా సరి చేయండి?

ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి

  • Written By:
  • Publish Date - May 23, 2023 / 04:05 PM IST

ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికే సెట్టింగ్స్ విషయంలో స్టేటస్, ప్రొఫైల్, లాస్ట్ సీన్, చాట్ ఇలా అనేక రకాల ఫీచర్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుండడంతో వినియోగదారుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. మాములుగా వాట్సాప్ లో కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఎడిట్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ తెలిపింది. అయితే ఈ ఎడిట్ ఆప్షన్ ఎలా పనిచేస్తుంది అన్న విషయానికి వస్తే.

సాధారణంగా వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్‌ పంపుతాము. దాన్ని సెలెక్ట్‌ చేస్తే copy, forward వంటి ఆప్షన్లు కన్పిస్తాయి. ఇక నుంచి వాటితోపాటు ఎడిట్ ఆప్షన్‌ కూడా ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి పంపిన మెసేజ్‌లో తప్పులు, అక్షర దోషాలను సరిచేసుకోవచ్చు. అయితే మెసేజ్‌ పంపిన 15 నిమిషాలలోపు ఎడిట్‌ ఎన్నిసార్లయినా ఎడిట్‌ చేసుకోవచ్చని జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తెలిపారు. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు ఎంతో బాగా ఉపయోగ పడుతుందని చెప్పవచ్చు.