Meta : “ఫేస్ బుక్ పే” ఇకపై “మెటా పే”.. మెటా వర్స్ కోసం “నోవి” వ్యాలెట్!

"ఫేస్ బుక్ పే".. ఇక "మెటా పే"గా మారింది. ఈవిషయాన్ని మెటా( ఫేస్ బుక్ ) సీఈవో మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - June 25, 2022 / 06:00 AM IST

“ఫేస్ బుక్ పే”.. ఇక “మెటా పే”గా మారింది. ఈవిషయాన్ని మెటా( ఫేస్ బుక్ ) సీఈవో మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. మునుపటి లాగే దీన్ని కూడా ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, మెసెంజర్ లలో చెల్లింపు అవసరాల కోసం వినియోగించవచ్చు. అయితే వీటికి అదనంగా మరో కొత్త ఫీచర్ ను దీనికి జోడించనున్నట్లు తెలుస్తోంది. “మెటా పే ” లో .. మెటా వర్స్ సంబంధిత లావాదేవీల కోసం ఒక ప్రత్యేక డిజిటల్ వ్యాలెట్ “నోవి” ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక పైసా కూడా ప్రాసెసింగ్ ఫీజు లేకుండా అంతర్జాతీయ లావాదేవీలు చేసే సౌలభ్యం ఉండటం “నోవి” ప్రత్యేకత. ఈ వ్యాలెట్ ద్వారా చెల్లింపులు జరిపి మెటా వర్స్ లో దుస్తులు, పాత్రలు, ఆర్ట్, వీడియో, మ్యూజిక్, వర్చువల్ ఈవెంట్స్ కొనొచ్చు. లేదంటే కొత్తగా క్రియేట్ కూడా చేయొచ్చు. ఇలా మెటా వర్స్ ద్వారా కొన్న వాటి ఓనర్ షిప్ ను నెటిజన్స్ నిరూపించుకునేందుకు మెటా వ్యాలెట్ దోహదం చేయనుంది. ఇదే విషయాన్ని ఇటీవల జుకర్ బర్గ్ కూడా ఓ ప్రకటన లో తెలిపారు. మెటా వర్స్ క్రియేటర్స్ కు కూడా ఈ ఫీచర్ ఎంతో దోహదం చేస్తుందని అంటున్నారు. “నోవి” ని వాడాలంటే.. ప్రభుత్వ గుర్తింపు కార్డు సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే వీడియో సెల్ఫీ ద్వారా ఐడెంటిటీ ధృవీకరించాలి.