Aadhaar Card Update: ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్నారా.. లేదంటే వెంటనే ఈ పని చేయండి?

భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ఇక భారత్ లో ఉన్నవారికి ఆధార్ కార్డు

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 04:00 PM IST

భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ఇక భారత్ లో ఉన్నవారికి ఆధార్ కార్డు అన్నది అతి ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా కూడా ఈ ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. గుర్తింపు ధ్రువీకరణ కోసం ఆధారపకార్డును ఉపయోగిస్తూ ఉంటారు. గవర్నమెంట్, ప్రైవేట్, బ్యాంక్ ఇలా ఎన్నో వాటికి ఆధార్ కార్డు అన్నది కీలకంగా మారిపోయింది. అటువంటి ఆధార్ కార్డులో ఏదైనా మిస్టేక్ ఉంటే వెంటనే మనం వాటిని సరిచేసుకోవచ్చు. వాటికి కొన్నిసార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే ఆధార్ కార్డులో కొన్ని కొన్నింటిని అప్డేట్ చేసుకోవడానికి అనేకసార్లు అవకాశం ఉన్నప్పటికీ కొన్ని అప్డేట్ లకు మాత్రమే రెండు లేదా మూడు సార్లు మాత్రమే అవకాశాలు ఉంటాయి.

ఆధార్ కార్డుకు వయసుతో పనిలేదు అప్పుడే పుట్టిన పిల్లలకు బాల ఆధార్ ని కూడా జారీ చేస్తారు. బాల ఆధార్ కు చిన్నారి బర్త్ సర్టిఫికెట్ తో పాటుగా పేరెంట్స్ ఆధార్ నెంబర్స్ ఉంటే సరిపోతుంది. అయితే ఐదేళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్ అనేది ఉండదు. ఐదేళ్ల తర్వాత ఐదు నుంచి ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు ఎప్పుడైనా కానీ వారు అప్డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు యుఐడిఏఐ మరొకసారి ఈ విషయం గురించి ట్వీట్ చేసింది. ఐదు నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ చేయడం మర్చిపోవద్దని గుర్తు చేసింది. అయితే ఎందుకోసం ఎటువంటి రుసుమును చెల్లించాల్సిన పనిలేదని తెలిపింది. మరి చిన్నపిల్లల ఆధార్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మొదట యుఐడిఏఐ అధికారిక వెబ్‌సైట్ ను Uidai.gov.in ను ఓపెన్ చేసి,మై ఆధార్ ట్యాబ్‌కు వెళ్లాలి. ఆ తరువాత బుక్ అన్ అప్పోయింట్మెంట్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు మిమ్మల్ని మరో పేజీకి తీసుకెళ్తుంది. యుఐడిఏఐ ఆధ్వర్యంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో నడిచే ఆధార్ సేవా కేంద్రం అని రెండు ఆప్షన్ల నుంచి ఒకటి ఏదయినా సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే డేట్ ఆఫ్ అపాయింట్‌మెంట్‌ను ఎంచుకోవాలి. అప్పుడు మళ్లీ మీ మొబైల్ నంబర్‌కు కన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత మీ పిల్లల ఆధార్ కార్డు 60 రోజుల్లోపు మీ పోస్టల్ అడ్రస్‌కు వస్తుంది. URN నంబర్ ఉంటే ఆన్‌లైన్‌లో బాల్ ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.