Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ కంప్యూటర్‌లో ఎలా పొందాలో మీకు తెలుసా?

Mixcollage 18 Feb 2024 04 04 Pm 3044

Mixcollage 18 Feb 2024 04 04 Pm 3044

ప్రస్తుత రోజుల్లో చాలామంది డెస్క్ టాప్ లాప్టాప్ లను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో తప్పకుండా వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. అయితే చాలామంది వీటిని వినియోగిస్తున్నారు కానీ అందులో ఉన్న అనేక ఫీచర్ల గురించి అసలు తెలియదు. అటువంటి ఫీచర్లలో వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్ కూడా ఒకటి. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు వాయిస్, వీడియో కాల్స్ చేయవచ్చు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని రక్షిస్తుంది.

అయితే మరీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి? అన్న విషయానికి వస్తే.. ఈ ఫీచర్ విండోస్ , Mac కోసం అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ పోర్ట్రెయిట్, ల్యాండ్‌స్కేప్ రెండింటిలోనూ పని చేస్తుంది. అయితే ముందుగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మీ ఫోన్‌లో వాట్సాప్ ఉండాలి. ఇప్పుడు మీరు Mac లేదా PCలో వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌ని కలిగి ఉంటే మాత్రమే మీరు సేవను పొందుతారు. మీరు QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డెస్క్‌టాప్‌లో వాట్సాప్ తెరవవచ్చు. అంటే, మీరు లాగిన్ చేయవచ్చు. ఇది మీరు వెబ్‌లో వాట్సాప్ కి ఎలా లాగిన్ అవుతారో అలాగే పోలి ఉంటుంది.

ఇప్పుడు మీరు వాయిస్ లేదా వీడియో కాల్ చేయాలనుకుంటున్న యూజర్‌ చాట్‌బాక్స్‌ని ఓపెన్ చేయాలి. వినియోగదారులు వాయిస్ కాల్, వీడియో కాల్ కోసం రెండు కొత్త బటన్‌లను చూస్తారు. ఇప్పుడు మీరు కోరుకున్న ఎంపికను ఎంచుకోవడం ద్వారా మాత్రమే ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఈ విధంగా మీరు కంప్యూటర్ నుండి వాట్సాప్ కాల్‌లను ప్రారంభించవచ్చు.