Site icon HashtagU Telugu

Mahindra Finance: వెహికల్ లోన్ కోసం ఎదురు చూస్తున్న వారికీ సూపర్ గుడ్ న్యూస్.. అదేమిటంటే?

Mahindra Finance

Mahindra Finance

సాధారణంగా వాహనాలు కొనుగోలు చేయడానికి లేదంటే ఇంటిని నిర్మించుకోవడానికి లోన్ల కోసం బ్యాంకుల చుట్టూకష్టపడి తిరుగుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు బ్యాంకు లోన్ రావడానికి రెండు మూడు రోజులు కూడా సమయం పడుతూ ఉంటుంది. అయితే ఇలా బ్యాంకుల చుట్టూ కారం తిరిగే ఓపిక లేక ఏదైనా ఈజీ ప్రాసెస్ ఉంటే బాగుండు అని కస్టమర్లు అనుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఒక ఒక గుడ్ న్యూస్. అదేమిటంటే..

తాజాగా ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీస్ కస్టమర్ లకు ఒక చక్కటి శుభవార్తను తెలిపింది. తన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఇక పై మహీంద్రా కస్టమర్ లకు లోన్లు ఈజీగా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇకపై భాగస్వామ్యంతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్యాసింజర్‌ వాహనాలు, త్రీ వీలర్, ట్రాక్టర్ , వ్యాపార వాహనాల లోన్ కేటగిరీల కోసం మహీంద్రా ఫైనాన్స్‌ కు లీడ్ రిఫరల్ సేవలను అందిస్తోంది.

అయితే ఇప్పటికే ఉన్న మహీంద్రా ఫైనాన్స్ కస్టమర్‌ల కు పోస్టాఫీసు లలో నగదు ఈఎంఐ డిపాజిట్ సౌకర్యాన్ని అందించనుంది. కాగా ఈ సేవలను మొదటగా మహారాష్ట్ర అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్‌లలో అందించనున్నారు. అయితే రాబోయే నాలుగు లేదా ఆరు నెలల్లో రెండు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాలలో కూడా విస్తరించాలని భావిస్తున్నారు. దీంతో పేమెంట్స్ బ్యాంక్ కూడా తన ఫైనాన్షియల్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో సర్వీసులను విస్తరించాలని భావిస్తోందట.

Exit mobile version