స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు ఎట్టకేలకు మార్కెట్లోకి విడుదల అయ్యాయి. మేడ్ బై గూగుల్ 2024 ఈవెంట్ లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ లతో పాటు పిక్సెల్ వాచ్ 3, పిక్సెల్ బడ్స్ ప్రో 2 లను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే వాచ్ అలాగే బర్డ్స్ సంగతి పక్కన పెడితే.. పిక్సెల్ 9 సిరీస్ లో వివిధ రకాల ప్రాధాన్యతలు, అవసరాలను తీర్చే నాలుగు విభిన్న మోడళ్ల స్మార్ట్ ఫోన్స్ ను తాజాగా నేడు మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఇకపోతే తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇది గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లో బేస్ మోడల్ పిక్సెల్ 9. ఈ ఫోన్ 6.3 అంగుళాల యాక్చువా డిస్ ప్లేతో వస్తుంది. ఇది క్రిస్ప్ 1080 x 2424 ఓఎల్ఈడీ రిజల్యూషన్ ను అందిస్తుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 68 రేటింగ్ ను కలిగి ఉంది. గూగుల్ ఇన్ హౌస్ టెన్సర్ జీ4 చిప్ సెట్ తో పాటు టైటాన్ ఎం2 సెక్యూరిటీ కోప్రాసెసర్ తో పనిచేసే ఈ ఫోన్ లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను అందించారు. అలాగే గూగుల్ పిక్సెల్ 9 లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా 8 రెట్ల వరకు సూపర్ రెస్ జూమ్ ను అందిస్తుంది. 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది.
ముందువైపు 10.5 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. గూగుల్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ ఉన్న 4700 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అమర్చారు. పిక్సెల్ 9 ధరను రూ.79,999 గా నిర్ణయించారు. ఎక్కువ పవర్ ను కోరుకునేవారికి పిక్సెల్ 9 ప్రో ఆకర్షణీయమైన ఎంపిక. దీని ధర రూ .1,09,999, ఇది స్టాండర్డ్ పిక్సెల్ 9 మాదిరిగానే 6.3 అంగుళాల స్క్రీన్ తో వస్తుంది. అయితే, ఎల్టీపీఓ టెక్నాలజీతో సూపర్ యాక్చువా డిస్ప్లే కు దీనిని అప్ గ్రేడ్ అవుతుంది, ఇది 1280 x 2856 రిజల్యూషన్, 3000 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ ను అందిస్తుంది.
పిక్సెల్ 9 ప్రో కూడా టెన్సర్ జి 4 చిప్సెట్తో పనిచేస్తుంది. కానీ 16 జిబి ర్యామ్, 1 టిబి వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో పనిచేస్తుంది. కాగా ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. వీటిలో 50 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 48 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ విత్ మాక్రో ఫోకస్, 48 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 30ఎక్స్ వరకు సూపర్ రెస్ జూమ్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 42 మెగా పిక్సెల్ ఫ్రంట్ లెన్స్ ను అందించారు. బ్యాటరీ, పవర్ పరంగా చూస్తే 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.