Aadhaar: ఆధార్ కార్డు పోయిందా.. అయితే భయపడాల్సిన పనిలేదు.. ఈ ఒక్క పని చేస్తే చాలు?

భారతీయులకు ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. భారత దేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఇటీవల

  • Written By:
  • Publish Date - May 16, 2023 / 07:40 PM IST

భారతీయులకు ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. భారత దేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఇటీవల రోజుల్లో ఆధార్ కార్డు అన్నది కీలకంగా మారిపోయింది. గవర్నమెంట్ ప్రైవేట్ ఇలా ప్రతి ఒక్క పనికి ఆధార్ కార్డు అన్నది తప్పకుండా ఉండాల్సిందే. ఆధార్ కార్డు లేనిదే ఏ పని జరగడం లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. అయితే చాలామంది అనుకోకుండా కొన్ని కొన్ని సార్లు ఆధార్ కార్డు పోగొట్టుకున్నప్పుడు కంగారుపడి తెగ భయపడిపోతూ ఉంటారు.

కానీ ఇప్పుడు డూప్లికేట్ ఆధార్ కార్డు పొందడం అన్నది చాలా సులువు. కొన్ని పద్ధతులను ఉపయోగించి ఆధార్ కార్డును ఈజీగా ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. UIDAI సర్వీస్ పోర్టల్ నుంచి మీ ఆధార్ కార్డు కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వివరాల్లోకి.. అందుకోసం ముందుగా https:///ssup.uidai.gov.in/web/guest/ssup-home లో వెబ్ పేజీని ఓపెన్ చేసి లాస్ట్ లేదా ఫర్గెటెన్ UID/EID బటన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ లేదా నమోదు సంఖ్యను ఎంచుకోవాలి. మీ పూర్తి పేరు నమోదు తో ఈమెయిల్ చిరునామా అలాగే నమోదిత మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి.

తర్వాత స్క్రీన్ పై ఉన్న సెక్యూరిటీ కోడ్ టైప్ చేసి వన్ టైం పాస్వర్డ్ పై క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్కు లేదా ఈమెయిల్ అడ్రస్కు ఒక ఓటిపి వస్తుంది దాని ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు లేదా ఇమెయిల్ అడ్రస్కు ఆధార్ నెంబర్ లేదా ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది. UIDAI సెల్ఫ్ సర్వీస్ హోటల్లోకి మళ్లీ వెళ్లి డౌన్లోడ్ ఆధార్ బటన్ పై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ లేదా ఎన్రోల్మెంట్ నెంబర్ పేరు పిన్ కోడ్ క్యాప్చకోడ్ ను ఎంటర్ చేయాలి. గెట్ వన్ టైం పాస్వర్డ్ బటన్ పై క్లిక్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ కార్డు కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.