Banking: ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యిందా.. అయితే ఇలా చేయండి?

ఈ మధ్యకాలంలో చాలావరకు ఏటీఎం ల వినియోగం తగ్గిపోయింది. ఎప్పుడో అత్యవసరం అలాగే డబ్బులు విత్ డ్రా

  • Written By:
  • Publish Date - November 28, 2022 / 05:40 PM IST

ఈ మధ్యకాలంలో చాలావరకు ఏటీఎం ల వినియోగం తగ్గిపోయింది. ఎప్పుడో అత్యవసరం అలాగే డబ్బులు విత్ డ్రా చేయాలి అన్నప్పుడు మాత్రమే ఏటీఎం ను ఉపయోగిస్తున్నారు. అయితే కొంతకాలం పాటు ఏటీఎం కార్డుని వినియోగించకపోవడం వల్ల చాలామంది ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ని మరిచిపోతూ ఉంటారు. అయితే ఏటీఎం కార్డు ని ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కువసార్లు రాంగ్ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే అప్పుడు ఏటీఎం కార్డు బ్లాక్ అవుతూ ఉంటుంది. అటువంటి సమయంలో తిరిగి కార్డు సేవలను ఎలా వినియోగించుకోవాలి అన్నది చాలా మందికి తెలియదు. సాధారణంగా ఒకసారి ఏటీఎం కార్డు బ్లాక్ అయితే తిరిగి కొత్త ఏటీఎం కార్డు పొందే వరకు ఏటీఎం కాటుపై లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయి.

కొంతమంది కార్డు బ్లాక్ చేసిన తర్వాత మళ్లీ కార్డును ఏ విధంగా పొందాలి అన్న విషయం తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఎటిఎం కార్డు వినియోగం, సేవలను పునరుద్ధరించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు పని తెలుసుకుందాం.. సాధారణంగా ఏటీఎం కార్డుని వరుసగా మూడుసార్లు తప్పుడు పిన్ నెంబర్ ని ఎంటర్ చేస్తే వెంటనే కార్డు దుర్వినియోగం కాకుండా ఉండడం కోసం ఆటోమేటిక్ గా లాక్ చేయబడుతూ ఉంటుంది. అటువంటిప్పుడు మీరు కొంచెం ఓపికతో ఉండాలి. ఎందుకంటే రాంగ్ పిన్ ఎంటర్ చేసిన కారణంగా లాక్ చేయబడిన కార్డు 24 గంటల నిర్ణీత వ్యవధి తర్వాత సేవలు పునరుద్దరించబడతాయి.

ఒకవేళ భద్రతా కారణాల వల్ల లేదా నిర్లక్ష్యం కారణంగా కార్డ్ బ్లాక్ చేయబడినప్పుడు, మీ కార్డ్‌ని అన్‌బ్లాక్ చేయడానికి సమీపంలోని బ్యాంక్‌లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ధృవీకరణ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత, బ్యాంక్ మీ అభ్యర్థనను 48 గంటల నుండి గరిష్టంగా 5 పని దినాలలో ప్రాసెస్ చేస్తుంది. కార్డ్ గడువు ముగియడం వల్ల కార్డ్ బ్లాక్ అయినప్పుడు, ప్రతి ఏటిఎం కార్డ్ దాదాపు 3 నుంచి 5 సంవత్సరాల చెల్లుబాటుతో వస్తుంది. కొత్త కార్డ్ కోసం దరఖాస్తు చేస్తే 5 నుంచి7 పని దినాలలో బ్యాంకు కొత్త కార్డును అందిస్తుంది.