Site icon HashtagU Telugu

Palm Payment : అరచేతిని చూపిస్తే చాలు.. పేమెంట్ పూర్తవుతుంది.. చైనా తడాఖా

Palm Payment System China Living In 2050 Pakistani Influencer Video

Palm Payment : చైనా దూసుకుపోతోంది. ఆర్థికపరంగా, సైనికపరంగా, పారిశ్రామికపరంగా, వ్యవసాయపరంగా, టెక్నాలజీపరంగా అమెరికాకు డ్రాగన్ టఫ్ ఫైట్ ఇస్తోంది. ప్రత్యేకించి చైనీస్ టెక్నాలజీ యావత్ ప్రపంచంలో ఫేమస్ అయింది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని చౌకగా డెవలప్ చేసి ప్రపంచానికి అందించడంలో ఏ దేశమైనా చైనా తర్వాతే  ఉంటుంది. పాకిస్తాన్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ రాణా హంజా సైఫ్ ఇటీవలే చైనాలో పర్యటించాడు. అక్కడ వాడకంలో ఉన్న అధునాత పేమెంట్ టెక్నాలజీని చూసి అతడు  ఆశ్చర్యపోయాడు. దానిపై రాణా హంజా చేసిన వీడియో వైరల్ అయింది. ఇంతకీ అదేంటో మనమూ చూద్దాం..

Also Read :Nayanthara : ‘‘ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారా ?’’.. నయనతార సుదీర్ఘ జవాబు

మన దేశంలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న డిజిటల్ పేమెంట్ టెక్నాలజీ విషయానికొస్తే.. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే మనం పేమెంట్స్ చేయలేం. స్మార్ట్‌ఫోన్ లేకుండా వెళ్లి ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలన్నా.. ఏటీఎం మెషీన్‌లో మన బ్యాంకు అకౌంటు నంబరు, పేరు, ఫోన్ నంబరు వంటి సమాచారాలన్నీ ఎంటర్ చేయాలి. ఫోనుకు వచ్చే ఓటీపీని సబ్మిట్ చేయాలి. ఇవన్నీ అక్కర లేకుండా ఓ అత్యాధునిక టెక్నాలజీని చైనా డెవలప్ చేసింది. అదే.. ‘పామ్ పేమెంట్ టెక్నాలజీ’. కేవలం మన అరచేతిని స్కానర్ స్క్రీన్‌పై పెడితే చాలు..  పేమెంట్(Palm Payment) ప్రాసెస్ పూర్తవుతుంది. మన బ్యాంకు అకౌంటు నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. ప్రస్తుతం ఈ టెక్నాలజీ చైనాలోని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.

Also Read :Census : 2025లో జనగణన.. 2028లో లోక్‌సభ స్థానాల పునర్విభజన

చైనాలోని ఝుఝౌ నగరంలో ఉన్న కిరాణా దుకాణంలోకి వెళ్లి అక్కడ వినియోగిస్తున్న ‘పామ్ పేమెంట్ స్కానర్’‌ను  ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ రాణా హంజా సైఫ్ చూపించాడు. అతడి ఒక స్నేహితుడు తన అరచేతిని ఆ స్కానర్‌పై పెట్టి పేమెంటును పూర్తి చేసి చూపించాడు. జేబులో పైసలు లేకున్నా.. ఫోన్ లేకున్నా.. బెంగ లేకుండా పేమెంటు పూర్తవడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇంతకుముందు ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా కూడా తన ‘ఎక్స్’ హ్యాండిల్‌లో  పామ్ పేమెంట్ టెక్నాలజీతో ముడిపడిన ఒక వీడియోను పోస్ట్ చేశారు. బీజింగ్ నగరంలోని మెట్రోలో ఒక మహిళ తన అరచేతితో పేమెంట్ చేస్తుండటం ఆ వీడియోలో కనిపించింది.