Best 5G Smartphones: రూ. 15 వేల బడ్జెట్ లో టాప్ 3 బెస్ట్ ఫోన్స్ ఇవే?

భారత్ లో ఇప్పటికే అనేక నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది అనగా

Published By: HashtagU Telugu Desk
Best 5g Smartphones

Best 5g Smartphones

భారత్ లో ఇప్పటికే అనేక నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది అనగా డిసెంబర్ 2023 నాటికి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఫైవ్ జీసేవ నన్ను ఆస్వాదించాలి అంతే 5జీ ఫోన్ కూడా ఉండాలి. ఒకవేళ మీరు 5జి ఫోన్ కొనాలి అని ఆలోచిస్తున్నట్లయితే వినియోగదారులకు అందుబాటులో ఉండే బడ్జెట్ లో అతి తక్కువ ధరకే మార్కెట్లో కొన్ని రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా కేవలం 15 వేల రూపాయల కన్నా తక్కువ ధరకే మార్కెట్ లో బెస్ట్ ఫోన్ లు లభిస్తున్నాయి.

మరి మార్కెట్లో ఉన్న టాప్ 3 బెస్ట్ ఫోన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మార్కెట్ లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ లలో సాంసంగ్ గెలాక్సీ ఎం 13 5జీ కూడా ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ , 64జీబీ స్టోరేజ్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే.. 50 ఎంపీ +2 ఎంపీ డ్యూయల్ ప్రైమరీ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కాగా ఇస్మార్ట్ ఫోన్ దొర భారత్ లో రూ. 13,999 గా ఉంది. రియల్ మీ నార్జో 50 5జీ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ తో వస్తున్న రియల్ మీ స్మార్ట్ ఫోన్ ధర అమెజాన్‌లో రూ. 14,999.

కెమెరాల విషయానికి వస్తే 48ఎంపీ అల్ట్రా హెచ్డీ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ 5000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. మోటో జీ 51 5జీ..ఇది కూడా 15 వేల రూపాయలలోపు ఉండే స్మార్ట్ ఫోన్ లలో ఇది కూడా ఒకటి. 5జీ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఒకటి. ఫీచర్లు 4 జీబీ ర్యామ్,64 జీబీ రోమ్ , 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 50ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000 mAH బ్యాటరీ ను కలిగి ఉంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర అమెజాన్‌లో రూ.14,999 గా వుంది.

  Last Updated: 14 Nov 2022, 05:51 PM IST