Site icon HashtagU Telugu

Voter ID Link: ఆధార్ ఓటర్ కార్డుకు లింకు కాకపోతే లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయకూడదా?

Voter Id Link

Voter Id Link

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికారులు ఆధార్ కార్డు ఓటర్ కార్డ్ లింక్ కు సంబంధించిన విషయాల్లో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాగా ఎన్నికల సమయానికి ఇక మిగిలింది కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ తర్వాత 18వ లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే తేదీని ప్రకటించింది. ఈ సారి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నాహాలు ప్రారంభించింది. దీని ప్రకారం ఎన్నికల ముందు ఓటర్లు ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సూచించింది.

కానీ మీరు దాని కోసం టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. మీరు దీన్ని ఆన్‌లైన్‌లో ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో ఏ విధంగా అనుసంధానం చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్, ఇమెయిల్ ఐడిని కూడా గమనించాలి. ముందుగా NVSP అధికారిక పోర్టల్ –https://www.nvsp.in/ లేదా ఓటర్ సర్వీస్ పోర్టల్ https://voters.eci.gov.inని సందర్శించి లాగిన్ చేసి సైన్ అప్ చేయాలి. సైన్ ఇన్ చేసిన తర్వాత మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత ఖాతాలోకి లాగిన్ చేయడానికి OTPని నమోదు చేయాలి.

సైన్ ఇన్ చేయకపోతే, మళ్లీ సైన్-అప్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ ను నమోదు చేసి, ఆపై సైన్ ఇన్ చేయడానికి కొనసాగించుపై క్లిక్ చేయాలి. ఆపై మీ వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌తో ఓటీపీ ని నమోదు చేయాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. ఆ తర్వాతే సైన్ అప్ అవుతుంది. ఇప్పుడు కింది స్క్రోల్ చేసి, ఆధార్ సేకరణపై క్లిక్ చేసి, ఫారమ్ 6B నింపాలి. ఆ తర్వాత ఆధార్, ఎన్నికల ఫోటో ID అవసరం. ఆ తర్వాత మీ ఓటర్ ఐడీలో నమోదైన EPIC నంబర్‌ను నమోదు చేసి, వెరిఫై అండ్‌ ఫిల్ ఫారమ్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన భాషను ఎంచుకుని, ఫారమ్‌ను ఫిలప్ చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఫారం 6బి పూరించాలి. అలాగే అవసరమైన పత్రాలను కూడా అందించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ ఓటర్ ఐడీ ఆధార్‌తో లింక్ అవుతుంది.

Exit mobile version