Site icon HashtagU Telugu

Lava Storm 5G: మార్కెట్ లోకి మరో సరికొత్త లావా స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Download (1)

Download (1)

ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ లావా ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే ఉంటుంది లావా సంస్థ. అయితే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎక్కువగా బడ్జెట్ ధరలో ఉండే స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. మరి ఆ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికొస్తే..

కాగా లావా సంస్థ తాజాగా మార్కెట్ లోకి లావా స్టార్మ్‌ 5జీ పేరుతో మొబైల్‌ను తీసుకొచ్చింది. 50 ఎంపీ ప్రధాన కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో బడ్జెట్‌ ధరలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా స్టోరేజీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ సింగిల్‌ వేరియంట్‌లో వస్తోంది. 8జీబీ+ 128జీబీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.13,499గా కంపెనీ నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్‌ కింద కొనుగోలు చేసిన వారికి రూ.11,999కే అందించనుంది. గేల్ గ్రీన్, థండర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. డిసెంబరు 28 నుంచి లావా ఇ-స్టోర్‌, అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇకపోతే లావా స్టార్మ్ 5జీ ఫీచర్ల విషయానికొస్తే..

ఈ ఫోన్‌ 6.78 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ అమర్చారు. ఆండ్రాయిడ్‌ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14కు అప్‌గ్రేడ్‌, రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందించనున్నట్లు లావా పేర్కొంది. వెనుక వైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా అమర్చారు. ముందు వైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో 5000mAh బ్యాటరీ అమర్చారు. ఇది 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వైఫై 5, బ్లూటూత్‌ 5.0, 3.5mm ఆడియో జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.