భారతదేశానికి చెందిన ప్రముఖ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తాజాగా విడుదల చేసిన Lava Shark 5G ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. కేవలం రూ. 7,999 ధరతో లభ్యమవుతున్న ఈ ఫోన్ 5G సపోర్ట్‌తోపాటు, క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్, బ్లోట్‌వేర్ లేకుండా అందిస్తోంది. ముఖ్యంగా అతి తక్కువ ధరలో 5G టెక్నాలజీని అందిస్తున్న ఈ ఫోన్ విద్యార్థులు, బడ్జెట్ వినియోగదారులకు ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది.
Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.75 ఇంచుల భారీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ యూజర్లకు స్మూత్ స్క్రోలింగ్ అనుభవం లభిస్తుంది. Lava Shark 5Gలో యూని SoC T765 ప్రాసెసర్‌తో పాటు ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం అందుబాటులో ఉంది. కెమెరా విషయానికి వస్తే, వెనుక భాగంలో 13MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ తో డ్యూయల్ కెమెరా సెట్‌అప్ ఉండగా, సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు. అదనంగా, ఈ ఫోన్ IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉంది.
లావా షార్క్ 5G స్మార్ట్‌ఫోన్ 5000mAh సామర్థ్యం గల బ్యాటరీతో పాటు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, USB Type-C పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ దేశంలోని ప్రముఖ రిటైల్ స్టోర్స్‌తో పాటు లావా అధికారిక వెబ్‌సైట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో అత్యుత్తమ ఫీచర్లతో కూడిన ఫోన్ కోసం చూస్తున్న వారికి Lava Shark 5G ఒక ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది.