Site icon HashtagU Telugu

Lava Blaze X 5G: మార్కెట్లోకి లావా నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. ప్రీమియం లుక్స్ తో ఆకట్టుకుంటోందిగా!

Mixcollage 05 Jul 2024 06 36 Pm 1210

Mixcollage 05 Jul 2024 06 36 Pm 1210

ప్రముఖ భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయినా లావా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను తీసుకువచ్చిన లావా సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ఫోన్లను తీసుకువస్తూ వినియోగదారులకు ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే లావా కంపెనీ ఎక్కువ శాతం తక్కువ ధరలు మంచి మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా తీసుకువస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే లావా తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. లావా బ్లేజ్‌ ఎక్స్‌ పేరుతో త్వరలోనే భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను తీసుకురాబోతోంది.

అయితే ఈ ఫోన్ ఈ నెల అనగా జులై 10వ తేదీన ఈ ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్‌ చేయనుంది. ఇక జుల్‌ 20వ తేదీన అమెజాన్‌ అందించనున్న అమెజాన ప్రైమ్‌ డే సేల్ 2024లో భాగంగా ఈ ఫోన్‌ మొదటి సేల్‌ ప్రారంభం కానుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికొస్తే.. కాగా ఈ లావా బ్లేజ్‌ ఎక్స్‌ 5జీ ఫోన్‌ ను మొత్తం మూడు వేరియంట్సలో లాంచ్‌ చేయనున్నారు. వీటిలో 4 జీబీ ర్యామ్‌, 6జీబీ ర్యామ్‌, 8 జీబీ ర్యామ్‌ ఉన్నాయి. ఇకపోతే ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్లో 64 మెగాపిక్సెల్స్‌ తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు.

ఎల్‌ఈడీ ఫ్లాష్‌ ను కూడా అందించనున్నారు. స్క్రీన్‌ పరంగా చూస్తే ఇందులో అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌తో అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే ఇందులో USB టైప్ C పోర్ట్, స్పీకర్ గ్రిల్ వంటి ఫీచర్స్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక ఫోన్‌కు కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్స్‌ ఉండనున్నాయి. లుక్స్‌ పరంగా ఫోన్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా బ్లేజ్‌ లెస్‌ స్క్రీన్‌, పంచ్‌ హోల్‌ కెమెరాను ఇవ్వనున్నారు. దీంతో ఫోన్‌ను రిచ్‌ లుక్‌ వచ్చింది. ధర విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోయినా ఫోన్‌ రూ. 20 వేల లోపు ఉండవచ్చని అంచనా.

Exit mobile version