భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా మొబైల్స్ (Lava Mobile ) తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా లావా “బోల్డ్ సిరీస్” (Lava “Bold Series”) కింద రెండు ఎంట్రీ లెవల్ మోడళ్లను విడుదల చేసింది. అవి లావా బోల్డ్ N1 (Lava Bold N1)మరియు లావా బోల్డ్ N1 ప్రో. రూ.7,000 లోపు ధరలో ఈ ఫోన్లు లభించనున్నాయి. తక్కువ బడ్జెట్‌లో మన్నికైన ఫీచర్లను కోరే వినియోగదారుల కోసం ఇవి ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి. UNISOC ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పాటు, రెండు ఫోన్లలోనూ మంచి డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ సామర్థ్యం కనిపిస్తుంది.
Ind – Pak War : పాకిస్తాన్ యుద్ధం ఎందుకు ఆపేశారో చెప్పాలి ..? కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు
లావా బోల్డ్ N1 ప్రో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, UNISOC T606 ప్రాసెసర్, 4GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5,000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు దీన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. దీని ధర రూ.6,799 గా నిర్ణయించారు. జూన్ 2 నుంచి అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఇక ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే.. లావా బోల్డ్ N1 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్, 4GB RAM, 64GB స్టోరేజ్ కలిగి ఉంది. ఇందులో 13MP రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది 10W ఛార్జింగ్ సపోర్టుతో 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌పై రన్ అవుతుంది. లావా బోల్డ్ N1 ధర రూ.5,999, జూన్ 4 నుంచి విక్రయానికి లభించనుంది. రేడియంట్ బ్లాక్, స్పార్కింగ్ ఐవరీ, టైటానియం గోల్డ్ వంటి ఆకర్షణీయ రంగుల్లో లభించనున్నాయి. రూ.100 డిస్కౌంట్ కూపన్‌తో వినియోగదారులకు మరింత తక్కువ ధరకు ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి.