ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. కొత్త కొత్త ఫోన్ల లను విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా రెడ్ మీ సంస్థ మరో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
రెడ్ మీ సంస్థ త్వరలో రెడ్ మీ 13 5 జీ పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ ఈ మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. ఎంఐ ఇండియా ఇటీవల ఎక్స్ పోస్ట్‌లో రెడ్ మీ 13 5జీ భారతదేశంలో జూలై 9 న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ లాంచ్ ఈవెంట్ ఎంఐ ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపింది. మరి వచ్చే నెల విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే.. డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో పాటు ఎల్‌ఈడీ ఫ్లాష్ వల్ల ఈ ఫోన్ డిజైన్ అందరికీ నచ్చుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఫోన్ బ్లూ అండ్ పింక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.
రెడ్ మీ 13 5జీ ఇప్పటివరకూ మార్కెట్‌లో లాంచ్ అయి 5 జీ ఫోన్స్ కంటే అతిపెద్ద డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14కు సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,030 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుందని టెక్ నిపుణులు చెబుతన్నారు. అయితే రెడ్ మీ 13 4 జీ వేరియంట్ ఈ నెలలో కొన్ని యూరోపియర్ దేశాల్లో ఆవిష్కరించారు. ఈ ఫోన్ మీడియాటెక మీ జీ91 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అలాగే ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్, 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 33 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,030 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ చేశారు.