Tech Tips: మీరు ల్యాప్‌టాప్‌ ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి?

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది అనేక రకాలు వాటి కోసం ల్యాప్‌టాప్‌ లను వినియోగిస్తున్నారు. కొందరు సాఫ్ట్వేర్ వాళ్ళ

  • Written By:
  • Updated On - February 19, 2024 / 07:24 PM IST

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది అనేక రకాలు వాటి కోసం ల్యాప్‌టాప్‌ లను వినియోగిస్తున్నారు. కొందరు సాఫ్ట్వేర్ వాళ్ళు కంపెనీ పర్పస్ కోసం ఉపయోగిస్తే మరికొందరు వీడియో గేమ్స్ అవి ఇవి అంటూ రకరకాల వాటి కోసం వినియోగిస్తూ ఉంటారు. అయితే ల్యాప్‌టాప్‌ ను వినియోగిస్తున్న వారు చాలామంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపుతాయి. దీని వల్ల ల్యాప్‌టాప్ బ్యాటరీ ఏడాదిలోపే కాకుండా కొన్ని నెలల్లోనే పాడైపోతుంది. ల్యాప్‌టాప్ బ్యాటరీ చెడిపోతే వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది.

కాబట్టి మీ ల్యాప్‌టాప్ బ్యాటరీని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి తప్పుడు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ల్యాప్‌టాప్ వేడెక్కడం ప్రారంభించినప్పుడు ఇది మీ ల్యాప్‌టాప్ బ్యాటరీని ప్రభావితం చేస్తుంది. మీరు ఎండలో కూర్చుంటే లేదా వేడి వాతావరణంలో పని చేస్తే అది సిస్టమ్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ల్యాప్‌టాప్ కూడా వేడెక్కడం ప్రారంభమవుతుంది. అందుకే ల్యాప్‌టాప్‌ను వేడెక్కించే పనిని చేయవద్దు. చాలా మందికి ల్యాప్‌టాప్ బ్యాటరీ తక్కువగా ఉన్న వెంటనే మళ్లీ మళ్లీ ఛార్జింగ్ పెట్టే అలవాటు ఉంటుంది. అలాగే బ్యాటరీని 100 శాతం ఛార్జింగ్ చేసిన తర్వాత కూడా ఎక్కువసేపు ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ జీవితకాలం తగ్గిపోతుంది.

అందుకే ల్యాప్‌టాప్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి బదులుగా, దానిని 80 శాతం వరకు మాత్రమే ఛార్జ్ చేసి, దాన్ని అన్‌ప్లగ్ చేయాలి. అవసరమైనప్పుడు మాత్రమే ల్యాప్‌టాప్‌ను ఛార్జ్‌లో ఉంచాలి. కొంత మంది బ్యాటరీ పూర్తిగా డెడ్ అయిన తర్వాతే ల్యాప్‌టాప్‌కు ఛార్జ్ చేస్తారు. కానీ ఇది సరైనది కాదు. ల్యాప్‌టాప్ బ్యాటరీ 20 శాతం కంటే తక్కువగా ఉంటే ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేయాలి. బ్యాటరీ పూర్తిగా డెడ్ అయ్యే వరకు వేచి ఉండకూడదు. కొత్త ల్యాప్‌టాప్‌తో అందించిన ఛార్జర్ పాడైపోయిన తర్వాత డబ్బు ఆదా చేయడానికి చాలా మంది నాణ్యత లేని తక్కువ ధరల్లో ఛార్జర్లు కొనుగోలో చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మీ డబ్బు ఆదా అవుతుంది. అయితే లోకల్ ఛార్జర్‌ని ఉపయోగించడం వల్ల మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ దెబ్బతింటుంది. కాబట్టి మీరు కూడా ల్యాప్‌టాప్‌ ని వినియోగిస్తుంటే పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు ల్యాప్‌టాప్‌పై ప్రభావం చూపుతాయి.