Cars: కార్లలో వస్తున్న ఈ కొత్త సిస్టం గురించి మీకు తెలుసా?

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మార్కెట్ లోకి అద్భుతమైన ఫీచర్లు, స్టైలిష్ లుక్ తో, ఆధునిక హంగులతో ఎన్నో రకాల

  • Written By:
  • Publish Date - December 16, 2022 / 07:00 AM IST

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మార్కెట్ లోకి అద్భుతమైన ఫీచర్లు, స్టైలిష్ లుక్ తో, ఆధునిక హంగులతో ఎన్నో రకాల కార్లను ఎప్పటికప్పుడు కార్ల కంపెనీలో మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీ కార్లలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి విడుదల అవుతున్న కార్లు ఎక్కువగా భద్రతకు సంబంధించిన ఫీచర్స్ ని అందిస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న ఫీచర్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ప్రాణాలకు రక్షణను కల్పిస్తున్నాయి. ఇకపోతే అసలు విషయంలోకి వెళితే.. మాములుగా కార్లలో లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ గురించి వినే ఉంటారు.

కానీ ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అన్నది చాలామందికి తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ అంటే.. ప్రస్తుతం ADAS వంటి భద్రతా ఫీచర్ లతో పాటుగా లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ కూడా అందిస్తున్నారు. ఈ సిస్టమ్ రోడ్ల పై ప్రమాదాలను తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అన్న విషయానికి వస్తే.. ఈ ఫీచర్‌తో కూడిన కార్లు రోడ్డు పై టు వే అంటే రోడ్డుని మధ్యలో విభజించే తెలుపు లేదా పసుపు గీతలు ఉన్న రోడ్లపై నడపడానికి సహాయపడతాయి. అప్పుడు ఈ సిస్టమ్ దాని పనిని ప్రారంభిస్తుంది.

రోడ్డుపై కదులుతున్నప్పుడు ఈ ఫీచర్ లైన్‌లను స్కాన్ చేస్తుంది ఇంకా ఏదైనా కారణం చేత కారు ఈ లైన్‌లకు చాలా దగ్గరగా వచ్చినప్పుడు అలారం ద్వారా డ్రైవర్‌ కు తెలియజేయడమే మాత్రం కాకుండా డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది. ఈ లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్‌ వల్ల రోడ్డు ప్రమాదాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. లేన్‌ మారి లేదా లేన్ నుండి వదిలి ఇతర లేన్‌లోకి వెళ్లినప్పుడు డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది, తద్వారా ఇతర వాహనాలను ఢీకొనే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే ప్రమాదాన్ని జరగకుండా అది నివారిస్తుంది. అయితే ఇప్పటికే ఈ సేఫ్టీ ఫీచర్ ను భారతదేశంలోని చాలా కార్లలో ఇచ్చారు. ఈ కార్లలో ఎం‌జి గ్లోస్టర్, ఎం‌జి ఆస్టర్, మహీంద్రా ఎక్స్‌యూ‌వి700, హోండా సిటీ, హ్యుందాయ్ టక్సన్ వంటి కార్లలో ఈ ఫీచర్ ని అందించారు.