Site icon HashtagU Telugu

Android Phone Track: మీ ఫోన్ పోయిందా? వెంటనే ఈ పని చేసి ఎక్కడుందో తెలుసుకోండిలా!

Android Phone

Android Phone

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ ని ఉపయోగిస్తున్నారు. సిటీలలో వాళ్ళు మాత్రమే కాకుండా పల్లెటూర్లలో ఉన్నవారు కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. కాగా రాను రాను ఈ స్మార్ట్ ఫోన్లవినియోగం పెరగడంతో స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ ఫోన్ ల దొంగతనాలు కూడా కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో చాలామంది స్మార్ట్ ఫోన్లు పోయాయి అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. అయితే చాలామంది ఈ స్మార్ట్ ఫోన్లు దొంగతనం జరిగింది అంటే ఆ మొబైల్ ఫోన్లో గురించి పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరగలేక వాటిపైన ఆశలు వదిలేసుకుంటున్నారు.

అయితే ఖరీదైన మొబైల్ ఫోన్లు వినియోగించే వారి పరిస్థితి కూడా ఒక విధంగా ఇలాగే ఉంది అని చెప్పవచ్చు. అయితే స్మార్ట్ ఫోన్ దొంగతనం జరిగిన తర్వాత ఏం చేయాలి అన్నది చాలామందికి తెలియదు. దీనితో చాలామంది పోతే పోయిందిలే అని అనుకోని బాధపడే ఆ తర్వాత మళ్ళీ కొత్త మొబైల్ ని కొనుకుంటున్నారు. మరి స్మార్ట్ ఫోన్ దొంగతనం జరిగినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్మార్ట్ ఫోన్ దొంగతనం జరిగిన తర్వాత వెంటనే. https://www.google.com/android/find?u=0 ని ఓపెన్ చేయాలి.

ఆ తర్వాత మొబైల్లో ఉన్న గూగుల్ అకౌంట్ లో లాగిన్ అవ్వాలి. అక్కడ మీ మొబైల్ కి సంబంధించిన లొకేషన్ ని సెర్చ్ చేయాలి. అప్పుడు దానికింద Play sound, Lock తో పాటు Erase అనే ఆప్షన్లు కనిపిస్తాయి. అప్పుడు పర్సనల్ డేటా ఉంటే వెంటనే Erase చేయండి. దానిని Lock చేయండి. లేదంటే Playsound క్లిక్ చేస్తే ఫోన్ సౌండ్ చేస్తుంది. తర్వాత మీరు దానిని ఆపితేనే ఆ సౌండ్ ఆగుతుంది లేదంటే అంతవరకు ఆ సౌండ్ మోగుతూనే ఉంటుంది. ఆ విధంగా మొబైల్ ఫోన్ ను ట్రేస్ చేసి పట్టుకోవచ్చు

Exit mobile version