Site icon HashtagU Telugu

Voter ID Aadhaar Link: ఓటర్ కార్డును ఆధార్ కార్డుకు ఎలా లింక్ చెయ్యాలో పూర్తి వివరాలు?

Vote Without Voter ID Card

Voter Id Aadhaar Link

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటిగా మారిపోయింది. దీంతో ప్రతి ఒక్క డాక్యుమెంట్ కు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓటర్ కార్డుకి ఆధార్ ను లింక్ చేస్తూ ఉంటారు. అయితే ఓటర్ కార్డుకి ఆధార్ నెంబర్ లింక్ చేయడం అన్నది తప్పనిసరి అని కాదు. ఓటర్లు వారి ఇష్టపూర్వకంగా మాత్రమే ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. కాగా ఓటర్ ఐడి కి ఆధార్ కార్డు లింక్ చేయడం ద్వారా ఒక వ్యక్తికి వేరే నియోజకవర్గం ఓట్లు ఉన్నా లేదంటే ఒకే నియోజకవర్గంలో వేరువేరు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నా తెలిసిపోతుంది అని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

2021లో పార్లమెంట్ ఎన్నికల చట్టాల సవరణ బిల్లు తర్వాత ఆమోదముద్ర పడ్డ అనంతరం ఆధ్వర్యంలో డేటా లింకును చేసే ప్రాసెస్ ను ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం వోటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేసే ప్రాసెస్ కొనసాగుతోంది. ఒకవేళ మీరు కూడా మీ ఆధార్ నెంబర్ ను ఓటర్ ఐడికి లింక్ చేయాలి అనుకుంటే అందుకు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ స్మార్ట్‌ ఫోన్‌ లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఇన్‌స్టాల్ చేసి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఓటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

ఆ టర్ ఎలక్టోరల్ ఆథెంటికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్‌ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. అప్పుడు ఎస్ ఐ హావ్ ఓటర్ ఐడి ఆప్షన్ సెలక్ట్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. మీ ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి, స్టేట్ సెలెక్ట్ చేయాలి. ఫెచ్ డిటైల్స్ ఆ తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డన్ పైన క్లిక్ చేస్తే మీ ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.