Site icon HashtagU Telugu

Solar Stove : గ్యాస్ అవసరం లేదు…కొత్త స్టవ్ వచ్చేసింది…ఎలా పనిచేస్తుంది…ధర, స్పెషాలిటి ఏంటో తెలుసా..?

solor stove

solor stove

కొన్నేండ్ల క్రితం వంట చేయడానికి కట్టెల పొయ్యి లేదా కిరోసిన్ స్టవ్ ను ఉపయోగించేవాళ్లం. కానీ కాలం మారుతున్న కొద్ది ప్రజలు ఇప్పుడు ఎల్పీజీ స్టవ్ మీద వండుతున్నారు. అయినప్పటికీ కొన్ని గ్రామాల్లో కట్టెల పొయ్యిమీద వంట చేసేవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఎల్పీజీ స్టవ్ మీద వంట చేయడం చాలా సులభంగా మారింది. బటన్ నొక్కి లైటర్ సాయంతో గ్యాస్ వెలిగించి ఎలాంటి సమస్య లేకుండా వంట చేసుకోవచ్చు. అయితే సిలిండర్ అయిపోయినప్పుడల్లా దాన్ని నింపాల్సిందే. కాగా పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ల ధరలు సామాన్యుడిని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఈ సమస్యను పరిస్కరించడానికి సోలార్ స్టవ్ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో గ్యాస్ సిలిండర్, కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టవ్ వీటిన్నింటికి చెక్ పెట్టవచ్చు. ఈ స్టవ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

సోలార్ స్టవ్ అంటే ఏమిటి…ఎలా పనిచేస్తుంది…?
ప్రభుత్వం తరపున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సౌరశక్తితో పనిచేసే స్టవ్ ను రిలీజ్ చేసింది. ఇప్పుడు గ్యాస్ తో పనిలేదు. ఈ స్టవ్ సూర్యుని కిరణాల ద్వారా రీఛార్జ్ అవుతుంది. దానిపై మీదే వంట చేసుకోవచ్చు . సూర్య నూతన్ చుల్హా ఈ స్టవ్ పేరు. ఈ స్టవ్ రీఛార్జ్ ను ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. ఢిల్లీలోని చమురు మంత్రి హార్దిప్ సింగ్ పూరీ నివాసంలో దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఈ స్టవ్ పై మూడు సార్లు ఆహారాన్ని కూడా వండి వడ్డించారు.

మీరు ఈ సూర్య నూతన్ చుల్హాను వంటగదిలో వాడుకోవచ్చు. దీనిమీద ఒక కేబుల్ ఉంటుంది. ఈ కేబుట్ ఇంటి పై కప్పుపై ఉన్న సోలార్ ప్లేట్ కు కనెక్ట్ చేస్తారు. సోలార్ ప్లేట్ ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తి కేబుల్స్ ద్వారా స్టవ్ కు చేరుతుంది. అప్పుడు దానిపై వంట చేసుకోవచ్చు. ఈ స్టవ్ జీవిత కాలం పది సంవత్సరాలు. ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు.

ధర..
ఈ స్టవ్ టెస్టింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు వాణిజ్యపరమైన లాంచ్ ఒక్కటే మిగిలింది. ధర గురించి చెప్పాలంటే 18 వేల నుంచి 30 వేల వరకు ఉంటుంది. అయితే ధరలు కూడా తగ్గవచ్చు. 2,3లక్షల స్టవ్ లను తయారు చేసి విక్రయించినప్పుడు దానిపై ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. అలా సబ్సిడీ ఇచ్చినట్లయితే దాని ధర 10 వేల నుంచి 12 వేల వరకు రావచ్చు.