44,174 కార్లు వెనక్కి తీసుకుంటున్న కియా.. కారణం తెలిస్తే షాక్!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఈ ఏడాది ఆరంభంలో కియా కారన్స్ కార్ ను లాంచ్ చేసిన విషయం మనందరికీ

  • Written By:
  • Publish Date - October 4, 2022 / 05:39 PM IST

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఈ ఏడాది ఆరంభంలో కియా కారన్స్ కార్ ను లాంచ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా కంపెనీ పరిశీలనలో కియా కారెన్స్ వాహనంలో ఎయిర్ బ్యాగ్ కంట్రోల్లో సాఫ్ట్వేర్ లోపాలు ఉన్నట్లు బయటపడ్డాయి. దీంతో వెంటనే స్పందించిన కియా కంపెనీ 44,174 కియా కారెన్స్ కార్లను వెనక్కి పిలిపించుకుంటోంది. అలాగే బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా, కార్ల తనిఖీ కోసం వాహనాలను స్వచ్ఛంగా రీ కాల్ చేయాలని నిర్ణయించినట్లుగా కంపెనీ ప్రకటించింది.

అయితే వెనక్కి తీసుకున్న కారులో సాఫ్ట్ వేర్ ను పరిశీలించి అందులో లోపాలు కనుక ఉన్నట్టు అయితే ఉచితంగానే సాఫ్ట్వేర్ అప్డేట్ అందిస్తాము అని కియా కంపెనీ వెల్లడించింది. కాగా ఇప్పటికే కియా కారెన్స్ కార్లు కొన్న యజమానులు సదరు కంపెనీని సంప్రదిస్తున్నారు. ఇది కంపెనీలు రీకాల్ క్యాంపెయిన్ నుంచి వారికి వివరిస్తుంది. ఈ వాహనాలను వెనక్కి తీసుకొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తోంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కానీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఈ కారు ధర 10 లక్షల లోపే ఉన్నట్టు ప్రకటించి విడుదల చేసింది కియా సంస్థ. కియా కారెన్స్ కారుదర విషయానికి వస్తే 8.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. కాగా కియా కారెన్స్ సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు బయటపడ్డాయి. ఈ లోపాలను కంపెనీ పరిష్కరించనుంది. ప్రయాణికుల సేఫ్టీ కోసం వీఎస్ఎం, టీపీఎంఎస్, డిస్క్ బ్రేక్స్ లాంటి అదనపు ఫీచర్స్ ఉన్నాయి.