Kia EV6 India launch:జూన్ లో ఇండియాలోకి కియా ఎలక్ట్రిక్ కారు ‘EV6’ – మే 26 నుంచి బుకింగ్స్ ప్రారంభం

వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కియా (KIA) కంపెనీ ఎలక్ట్రిక్ కారు ' EV6'.. జూన్ నెలలో భారత్ మార్కెట్లో విడుదల కానుంది.

  • Written By:
  • Publish Date - April 23, 2022 / 02:25 PM IST

వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కియా (KIA) కంపెనీ ఎలక్ట్రిక్ కారు ‘ EV6’.. జూన్ నెలలో భారత్ మార్కెట్లో విడుదల కానుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ మే నెల 26 నుంచే ప్రారంభం కానున్నాయి. 2021 మే లొనే ఆవిష్కృతమైన KIA EV6 విక్రయాలు.. ఇప్పటికే చాలా దేశాల్లో ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో దీని ధర రూ.31 లక్షల నుంచి రూ.42 లక్షల దాకా ఉంది. భారత్ కు దిగుమతి చేసుకుంటే ఎక్స్ షో రూమ్ ధర దాదాపు రూ.60 లక్షలకు చేరొచ్చని వాహనరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ముఖ్య ఫీచర్స్ ..
– KIA EV6 కారును స్టార్ట్ చేసిన 5 నుంచి 7 సెకన్లలోనే 100 KMPH స్పీడ్ ను అందుకుంటుంది.
– ఈ కారు సీక్వెన్షియల్ డైనమిక్ లైట్ ప్యాటర్న్‌తో సొగసైన డీఆర్‌ఎల్స్‌తో వస్తోంది.
– కారు సైడ్ ప్రొఫైల్ సొగసైన ఏరోడైనమిక్ డిజైన్‌తో ఆకర్షణీయమైన లుక్‌ను అందించనుంది.
– రియర్-వీల్-డ్రైవ్, ఆల్-వీల్-డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది.
– AWD వెర్షన్‌లో గరిష్టంగా 605 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది.

బ్యాటరీ సమాచారం..
– KIA EV6 కారు 58 kWh, 77.4 kWh అనే రెండు వేర్వేరు కెపాసిటీలతో కూడిన బ్యాటరీ ప్యాక్‌లతో రానుంది.
– బ్యాటరీ సామర్ధ్యాన్ని బట్టి ప్రయాణ దూరం నిర్ణయం అవుతుంది.
– 77.4 kWh బ్యాటరీని ఒకసారి ఫుల్ చేసుకుంటే 528 కిలోమీటర్లు జర్నీ చేయొచ్చు,
– 58 kWh బ్యాటరీని ఒకసారి ఫుల్ చేసుకుంటే 378 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
– 7 KW హోమ్ ఛార్జర్ తో .. 7 గంటల్లో బ్యాటరీ 100 శాతం ఛార్జింగ్ అవుతుంది.
– 50 KW CD ఫాస్ట్ ఛార్జర్ తో 1 గంటలో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది.
– 350 KW అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్ తో 18 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.