Site icon HashtagU Telugu

KIA Electric Car: భారత మార్కెట్లోకి కియా ఎలక్ట్రిక్ కారు ఈవీ6… వివరాలు..!!

Electric Car

Electric Car

కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్…భారత్ లో ఎలక్ట్రిక్ కారు ఈవీ6 ఎలక్ట్రిక్ క్రాసోవర్ ను పరిచయం చేసింది. జీటీ లైన్ ఆర్ డబ్ల్యూడీ , జీటీ లైన్ ఏడబ్ల్యూడీ పేరుతో ఇది రెండు వేరియంట్లలో రానుంది. ఇందులో జీటీ లైన్ ఆర్ డబ్ల్యూడీ ధర రూ. 59,95 లక్షలు కాగా…జీటీ లైన్ ఏడబ్ల్యూడీ ధర రూ. 64.95లక్షలగా ఉంది. భారత మార్కెట్లోకి వంద యూనిట్లను విడుదల చేయగా…అన్నీ కూడా బుక్కయ్యాయి.
ఈవీ6కి సంబంధించి కియా పూర్తిగా నిర్మించిన కార్లనే భారత మార్కెట్లోకి తీసుకువస్తోంది.

ఇప్పటివరకు 355 ప్రీ బుకింగ్ ఆర్డర్లు నమోదు అయ్యాయి. దీంతో కియా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే భారత్ కు మరిన్ని ఈవీ6 కార్లు కేటాయిస్తామని కియా చెబుతోంది. కాగా మే 26 నుంచి భారత్ లో ఈవీ 6 బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. బుకింగ్ సమయంలో కస్టమర్లు రూ. 3లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కియా ఈ ఏడాది సెప్టెంబరులో కార్లను కొనుగోలుదారులకు అందించనుంది.

ఈవీ6 సాంకేతిక విషయాన్ని చూసినట్లయితే…ఆర్ డబ్ల్యూడీ మోడల్ లో సింగిల్ మోటార్ సెటప్ ను అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే 528కిలీమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక ఏడబ్ల్యూడీ వెర్షన్ లో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 425కిలీమీటర్లు ప్రయాణిస్తుంది. డబుల్ మోటార్ సెటప్ కారణంగా సింగిల్ ఛార్జింగ్ తో ఇది తక్కువ దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. రెండు మోడళ్లలోనూ 77.4కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్ ను అమర్చారు.

Exit mobile version