Kawasaki Bike: కవాసకి కొత్త బైక్..ధర, ఫీచర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

జపాన్ కి చెందిన కవాసకి బైక్ తాజాగా ఇండియన్ మార్కెట్ లోకి జెడ్ 900 బైక్ ను విడుదల చేసింది. తాజాగా విడుదల

Published By: HashtagU Telugu Desk
Kawasaki Ninja 500

Kawasaki Z900

జపాన్ కి చెందిన కవాసకి బైక్ తాజాగా ఇండియన్ మార్కెట్ లోకి జెడ్ 900 బైక్ ను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ బైక్ ఎటువంటి మెకానికల్ అప్ గ్రేడ్ చేయలేదు. కానీ కొత్త డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ రూపంలో కాస్మోటిక్ అప్డేట్ లభిస్తుంది. ఇకపోతే ఈ బైక్ లో చేసిన మార్పుల విషయానికి వస్తే.. కొత్త పెయింట్ స్కీమ్ జెడ్900 కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ రిఫ్రెష్ చేస్తుంది. వీటితోపాటుగా ఫ్రేమ్ అండ్ వీల్స్ కలర్స్ స్కీం ఆధారంగా గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ ఆప్షన్లను పొందుతాయి.

ఇక ఈ బైక్ కి అడ్రసివ్ ఎల్ఈడి హెడ్ లాంప్ లు అదేవిధంగా ట్యాంకు ష్రూడ్ లతో మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్ సెటప్, జెడ్ ఆకారపు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ పొందుతుంది. కాగా ఈ బైక్ ధర విషయానికి ఎక్స్ షోరూం ధర 8.93 లక్షలు. ఇక ఈ బైక్ ప్రత్యేకత విషయానికి వస్తే వెనుక టైర్ ట్రాక్షన్ కోల్పోయింది అని గుర్తించినప్పుడు వెంటనే పవర్ డెలివరీ ని తగ్గిస్తుంది. కాగా ఈ బైక్ లో రెండు పవర్ మోడ్ లు ఉన్నాయి. అవి లో పవర్ అండ్ ఫుల్ పవర్. కవాసకి Z900948 cc, ఇన్‌లైన్ 4-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ BS-VI ఇంజన్‌ పొందుతుంది.

ఈ బైక్ 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 123.6 బిహెచ్‌పి, 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 98.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. ఇ బైక్ జెడ్ 900 యాక్షన్ కంట్రోల్ తో వస్తుంది. అలాగే దీనికి స్క్రీన్, దాంతో పాటుగా బ్లూటూత్ కనెక్టివిటీ కి కూడా సపోర్ట్ చేస్తుంది. బ్రేకింగ్ ముందు డ్యూయల్ 300 ఎమ్ ఎమ్ పెటల్ డిస్క్, వెనుక భాగంలో 250 ఎమ్ఎమ్ పెటల్ డిస్క్ లను పొందుతుంది.

  Last Updated: 16 Sep 2022, 10:32 PM IST