Site icon HashtagU Telugu

Kawasaki: కవాసకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు ధర తెలిస్తే వావ్ అనాల్సిందే?

Kawasaki

Kawasaki

ఐరో స్పేస్ కంపెనీ అయినా కవాసకి ఇప్పటికి ఎన్నో రకాల బైక్స్ ని మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచుల మేరకు మార్కెట్ లోకి మైక్ ని అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది కవాసకి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ ని EICMA 2022 లో పరిచయం చేసింది. అయితే ఈ బైక్స్ ని కంపెనీ వచ్చే ఏడాది లో లాంచ్ చేయనుంది. కాగా ఈ బైక్స్ జెడ్ అండ్ నింజా ఆధారంగా ఉంటాయి.

యూరోపియన్ ఏ1 వాహన లైసెన్స్ నిబంధనలకు అనుగుణంగా ఈ బైక్స్ రూపొందించినట్లు కవాసకి సంస్థ వెల్లడించింది. జెడ్ అండ్ నింజా ఎలక్ట్రిక్ బైక్స్ ఇప్పటికీ ప్రోటో టైప్ దశలోనే ఉన్నాయి. ఈ రెండు బైక్స్ కి సింగిల్ పవర్‌ ట్రెయిన్‌ ను కలిగి ఉంటాయి. వీటికి 3kWh సామర్థ్యంతో డ్యూయల్ బ్యాటరీ అందించడం జరిగింది. ఈ బైక్స్ పెట్రోల్‌ తో నడిచే 125 సీసీ బైక్స్ కి సమానమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్ స్పెసిఫికేషన్‌ల గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

కాగా తాజాగా పరిచయం చేసిన ఈ ఎలక్ట్రిక్ బైక్స్ బ్యాక్ వీల్స్ చైన్ డ్రైవ్‌ తో ఎలక్ట్రిక్ మోటార్‌ ను ఉపయోగిస్తాయి. ఇకపోతే హార్డ్‌ వేర్ విషయానికొస్తే ఈ రెండు విల్స్ కి డిస్క్ బ్రేక్‌ లు ఇచ్చారు. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు అలాగే వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్ ఉంటాయి. జెడ్ ఎలక్ట్రిక్ బైక్ కవాస కి Z250 నేక్డ్ స్ట్రీట్ బైక్ డిజైన్ లాంగ్వేజ్ పోలి ఉంటుంది.