Techie’s Grief: 4 నెలల్లో 3 కంపెనీల్లో ఉద్యోగం ఊస్టింగ్.. టెక్కీ ఆవేదన వైరల్!

ఇప్పుడు ఏ కంపెనీ చూసినా ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టెకీ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగుల తొలగింపును కొనసాగుతున్నాయి.

  • Written By:
  • Publish Date - January 22, 2023 / 09:40 PM IST

Techie’s Grief: ఇప్పుడు ఏ కంపెనీ చూసినా ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టెకీ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగుల తొలగింపును కొనసాగుతున్నాయి. చిన్నా చితక కంపెనీలు మాత్రమే కాదు, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, విప్రోలాంటి కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకోవడంతో భాగంగా తమ ఉద్యోగుల శాతాన్ని విపరీతంగా తగ్గించుకుంటున్నాయి. దీని వల్ల వేల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్ల మీద పడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 టెక్ కంపెనీలు 50వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, స్విగ్గీ, విప్రోలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే తాజాగా గూగుల్ లో తన ఉద్యోగం కోల్పోయిన ఓ టెక్కీ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన ఉద్యోగం నాలుగు నెలల్లో మూడుసార్లు, మూడు కంపెనీల లేఆఫ్ వల్ల పోయినట్లు అతడు తన ఆవేదనని వ్యక్తం చేశాడు.

తాజాగా గూగుల్ కంపెనీ తన ఉద్యోగాన్ని తొలగించగా.. అంతకు ముందు అమెజాన్ ఉద్యోగాన్ని నవంబర్ లో, స్నాప్ లో ఉద్యోగాన్ని సెప్టెంబర్ లో కోల్పోయినట్లు సదరు ఉద్యోగి వివరించాడు. తన పోస్టులో స్పందిస్తూ.. ‘నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. కొత్తగా ఉపాధిని కనుక్కోవాల్సి ఉంది. ఏదైనా టెక్ కంపెనీ నియామకాలు చేస్తుందా? నేను కొన్ని నెలల సెలవు తీసుకొని వేసవిలో మళ్లీ ప్రయత్నించాలా? స్టార్టప్ ప్రారంభించాలా?’ అని రాసుకొచ్చాడు.

నాలుగు నెలల వ్యవధిలోనే మూడు కంపెనీల్లో ఉద్యోగం పోవడం అనేది నిజంగా బాధాకరం అని ఈ పోస్టు చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లక్షల ప్యాకేజీతో ఒకప్పుడు అందరినీ ఊరించిన టెక్ ఉద్యోగాలు ఇప్పుడు మాత్రం అందరినీ భయపెడుతున్నాయి. తాజాగా గూగుల్ 12000 మంది ఉద్యోగులను, అమెజాన్ 18000 మంది ఉద్యోగులను, మైక్రోసాఫ్ట్ 10000 మంది ఉద్యోగులను, మెటా 11000 మంది ఉద్యోగులను, ట్విట్టర్ సగం మంది ఉద్యోగులను, విప్రో 400 మంది ఉద్యోగులను తొలగించడం తెలిసిందే.