Site icon HashtagU Telugu

Jio true 5G: గుడ్ న్యూస్.. దేశంలో జియో 5జీ సేవలు ప్రారంభం..!

India 5g

India 5g

రిలయన్స్ జియో భారతదేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో అధిక ప్రాంతాలలో తన 5G ఆధారిత వైఫై సేవలను ప్రారంభించింది. ఇంకా 5G పరికరాలు లేదా 5G SIM లేని వారికి 5G వేగాన్ని అందించాలనే లక్ష్యంతో WiFi సేవను స్మార్ట్‌ఫోన్‌తో ఎవరైనా యాక్సెస్ చేయవచ్చు. Jio 5G WiFi అందుబాటులో ఉండే ప్రాంతాలలో విద్యా సంస్థలు, మతపరమైన ప్రదేశాలు, రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌లు, వాణిజ్య కేంద్రాలు, మరిన్ని ఉన్నాయి. రెండు నెలల క్రితం రిలయన్స్‌ ప్రకటించినట్లుగానే.. శనివారం హై స్పీడ్‌ టెలికం సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

ఆ సంస్థ ఛైర్మన్‌ ఆకాష్‌ అంబానీ రాజస్థాన్‌‌లోని రాజసమంద్‌లో గల శ్రీనాథ్‌జీ ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభించారు. దీంతో ఈ దీపావళి నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో యూజర్లకు 5జీ సేవల్ని వినియోగించుకునే సదుపాయం కలగనుంది. 5G అనేది చాలా తక్కువ మంది లేదా మన అతిపెద్ద నగరాల్లో ఉన్న వారికి ప్రత్యేకమైన సేవగా ఉండకూడదు. ఇది భారతదేశం అంతటా ప్రతి పౌరుడికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యాపారానికి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ప్రతి భారతీయుడు JioTrue5Gని ఎనేబుల్ చేయడానికి ఇది ఒక అడుగు అని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇక 2023 డిసెంబర్‌ నాటికి దేశంలోని ప్రతి పట్టణానికి, మండలానికి, తాలూకాకు 5జీ నెటవర్క్‌ను విస్తరించాలనేది తమ ఉద్దేశమని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ గతంలో ప్రకటించారు. 5జీ స్టాండలోన్‌ పేరుతో 5జీ తాజా వెర్షన్‌ను విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. Apple, Samsung మరియు Google వంటి ప్రధాన ఫోన్-తయారీదారులు రాబోయే రెండు నెలల్లో 5G-రెడీ OTA (ఓవర్-ది-ఎయిర్) అప్‌డేట్‌లను విడుదల చేస్తారని భావిస్తున్నారు.