Site icon HashtagU Telugu

Air Fiber: వేగవంతంగా జియో 5జీ సేవలు.. త్వరలోనే జియో ఎయిర్ ఫైబర్?

Air Fiber

Air Fiber

5జీ నెట్‌ వర్క్‌లో రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శరవేగంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కాగా ఇకంలోకి చివరిగా ఎంట్రీ ఇచ్చి పరిశ్రమలో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న జియో దేశవ్యాప్తంగా 5జీ సేవలను జెట్ స్పీడ్ లో విస్తరిస్తోంది. కాగా ఈ ఏడాది దీపావళి నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకి జియో 5జీ సేవలను అందిస్తామని ఇప్పటికే రిలయన్స్ సంస్థ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఈ సంస్థ త్వరలోనే అనగా మరికొన్ని నెలల్లో జియో ఎయిర్ ఫైబర్ అనే ఉత్పత్తిని విడుదల చేయనుంది. ఎయిర్ ఫైబర్ ఇంట్లో ఉంటే చాలు. ఎలాంటి అంతరాయాలు లేకుండా వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ సేవలను ఈజీగా పొందవచ్చు. కాగా ఇది ఇది ఫిక్స్ డ్ లైన్ ద్వారా ఇంటర్నెట్ సేవలను ఆఫర్ చేస్తున్న ఎయిర్ టెల్, యాక్ట్, బీఎస్ఎన్ఎల్ కు గట్టి పోటీని ఇస్తుందని భావిస్తున్నారు. జియో ఎయిర్ ఫైబర్ కు ఎలాంటి వైర్లూ అవసరం లేదు. చిన్నపాటి ఎయిర్ ప్యూరిఫయర్ గా కనిపించే జియో ఎయిర్ ఫైబర్ 5జీ హాట్ స్పాట్ గా పనిచేస్తుంది.

ప్రస్తుతం పోర్టబుల్ రూటర్ల సహాయంతో వైర్ లెస్ బ్రాడ్ బ్యాండ్ సేవలను పొందుతున్నాము. అయితే వీటితో పోలిస్తే జియో ఎయిర్ ఫైబర్ ద్వారా నెట్ వర్క్ సామర్థ్యం మరింత బలంగా ఉంటుందని తెలుస్తోంది.. కాగా 2022 అక్టోబర్ లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం లోనే జియో ఎయిర్ ఫైబర్ ను ఆవిష్కరించింది. కానీ అప్పటికి 5జీ సేవలు ఇంకా ఆరంభం కావాల్సి ఉంది. ఆ తర్వాత క్రమంగా దీని తయారీ పై సంస్థ దృష్టి పెట్టింది. రూటర్లను సెటప్ చేసేందుకు టెక్నీషియన్ల అవసరం జియో ఎయిర్ ఫైబర్ తో తప్పనుంది. ఎయిర్ ఫైబర్ ద్వారా 1.5 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ ను ఇస్తానని జియో చెబుతోంది.

Exit mobile version