Jio Number Re Verification : జియో సిమ్ వాడుతున్నారా ? ఫోన్ నంబర్ రీ వేరిఫికేషన్ ఇలా..

మీకు కూడా అలాంటి మెసేజ్ వచ్చి ఉంటే వెంటనే  మీ ఫోన్ నంబర్​ను రీ వేరిఫై చేసుకోండి. ఇది తప్పనిసరి అని గుర్తుంచుకోండి.

  • Written By:
  • Publish Date - April 29, 2024 / 09:22 AM IST

Jio Number Re Verification : మీరు జియో సిమ్ వాడుతున్నారా ? అయితే ఈ సమాచారం మీకోసమే ! ఇతరుల ఐడీ కార్డులతో రిలయన్స్ జియో సిమ్ తీసుకొని వాడుతున్న వాళ్లంతా ఇప్పుడు తప్పకుండా రీ వేరిఫికేషన్ చేయించుకోవాల్సిందే. లేదంటే సిమ్ కార్డు బ్లాక్ అవుతుంది. రీ వేరిఫికేషన్ చేయించుకోవాలని కోరుతూ రిలయన్స్ జియో ఇప్పటికే తమ యూజర్లకు మెసేజ్​లు పంపుతోంది. కాల్స్ చేస్తోంది.  మీకు కూడా అలాంటి మెసేజ్ వచ్చి ఉంటే వెంటనే  మీ ఫోన్ నంబర్​ను రీ వేరిఫై చేసుకోండి. ఇది తప్పనిసరి అని గుర్తుంచుకోండి.

We’re now on WhatsApp. Click to Join

  • జియో ఫోన్ నంబరు రీ వేరిఫికేషన్ కోసం మీరు తొలుత మై జియో(My Jio) యాప్​‌లోకి ఫోన్ నంబరు ద్వారా లాగిన్ కావాలి.
  • అక్కడ మీకు  ‘రీ వేరిఫికేషన్ పెండింగ్’ అనే  మెసేజ్ కనిపిస్తుంది.
  • ఆ మెసేజ్‌పై క్లిక్ చేయగానే  ‘రీవేరిఫై నౌ’ అనే బటన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  •  అనంతరం వచ్చే బాక్సులలో మీ ఆధార్​ నంబర్​ను ఎంటర్ చేయాలి. ఒకవేళ అది లేకుంటే ఓటర్​ ఐడీ, పాస్​పోర్ట్ లాంటి ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాల వివరాలను కూడా అప్‌లోడ్ చేయొచ్చు.

Also Read :Sixth Phase Elections : ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

  • ఆధార్​తో వేరిఫై చేసుకోవాలని భావించే వారు ఆధార్​కార్డ్ అనే ఆప్షనుపై క్లిక్ చేసి, జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. మీ ఫోన్ నంబరుకు వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి.
  • అనంతరం ఫోన్​ కెమెరాను ఓపెన్ చేసి.. మీ ఫొటో తీసుకోవాలి.  ఈ ఫొటో తప్పకుండా ఆధార్ కార్డులో ఉన్న ఫొటోతో మ్యాచ్ కావాలి.
  •  చివరగా సబ్మిట్ బటన్​పై మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది.
  • ఆ తర్వాత మీ జియో నంబర్​ రీ వేరిఫికేషన్ ప్రాసెస్ ప్రారంభమయ్యాక ఫోనుకు ఒక ఎస్​ఎంఎస్ వస్తుంది. దానిలో టికెట్ ఐడీ ఉంటుంది.
  • జియో నంబర్ రీ వేరిఫికేషన్ పూర్తవడానికి దాదాపు 8 గంటలు టైం పడుతుంది.
  • రీ వేరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక దానిపై మీకు మరో మెసేజ్ అందుతుంది.

Also Read :CM Revanth Reddy : కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అల్లుడి తరఫున సీఎం రేవంత్ ప్రచారం