Jio Cinema: జియో సినిమా నుంచి మూడు అదిరిపోయే ప్లాన్స్.. ధరల వివరాలు ఇవే?

రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి చెందిన స్ట్రీమింగ్ సర్వీస్ జియో సినిమాకు ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి ఆదరణ

  • Written By:
  • Publish Date - April 25, 2023 / 05:57 PM IST

రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి చెందిన స్ట్రీమింగ్ సర్వీస్ జియో సినిమాకు ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. జియో సినిమాలో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను అదిరిపోయే ప్లాన్స్ ని అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే జియో సినిమా త్వరలోనే వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లను కంపెనీ కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌ సీజన్‌లో క్రికెట్‌ అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ పొందుతోంది జియో సినిమా.

ఇది ఇలా ఉంటే జియో సినిమా కొత్తగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, మ్యూజిక్‌ వీడియోలతో అలరించనుంది. ఒకవైపు ఐపీఎల్‌ను ఫ్రీగా చూసే వెసులుబాటు కల్పిస్తూనే మరోవైపు కొత్తగా తీసుకొచ్చే కంటెంట్‌కు డబ్బులు వసూలు చేయబోతున్నామని రిలయన్స్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో జియో సినిమా తీసుకురాబోతున్న ప్లాన్లు ఇవేనంటూ ఆన్‌లైన్‌లో కొన్ని స్క్రీన్‌షాట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. సినిమా నుంచి మూడు ప్లాన్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. డైలీ, గోల్డ్‌, ప్లాటినమ్‌ పేర్లతో ఈ ప్లాన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
డైలీ ప్లాన్‌ను కేవలం రూ.2కే జియో అందించనున్నట్లు తెలుస్తోంది.

వాస్తవంలో ఈ ప్లాన్‌ ధరను జియో రూ.29గా పేర్కొన్నప్పటికీ డిస్కౌంట్‌ లో కేవలం రూ.2కే అందించనున్నట్లు సమాచారం. అంటే ఒకసారి రూ.2 పెట్టి డైలీ ప్యాక్‌ కొనుగోలు చేస్తే 24 గంటల పాటు యాప్‌లో కంటెంట్‌ను వీక్షించవచ్చు. ఒకేసారి రెండు డివైజుల్లో వీక్షించే సదుపాయం కూడా ఉంది. ఇక గోల్డ్‌ స్టాండర్డ్‌ ప్లాన్‌ విషయానికి వస్తే.. దీని ధరను రూ.299గా పేర్కొన్నప్పటికీ రిలయన్స్‌ దీనిని కేవలం రూ.99కే అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వ్యాలిడిటీ మూడు నెలలు. ఈ ప్లాన్‌లో సైతం రెండు డివైజుల్లో ఒకేసారి కంటెంట్‌ను వీక్షించవచ్చు. ప్రీమియం ప్లాన్‌ ధరను రిలయన్స్ రూ.1199గా పేర్కొంది. డిస్కౌంట్‌లో రూ.599కే అందిస్తోంది. ఏడాది వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌లో ఏకకాలంలో నాలుగు డివైజులను వినియోగించుకోవచ్చు. ఎటువంటి ప్రకటనలు ఉండవు. అయితే ఈ ప్లాన్లను రిలయన్స్ జియో అధికారికంగా ప్రకటించలేదు. అయితే, అందరికీ ఒకేలాంటి ప్లాన్లు ఉంటాయా? జియో యూజర్లకు వేరే ప్లాన్లు ఏమైనా ఉంటాయా? అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.