Site icon HashtagU Telugu

Jio Phone 5G : త్వరలో మార్కెట్లోకి జియో 5జీ స్మార్ట్ ఫోన్… కోడ్ నేమ్, ఫీచర్లు లీక్…ధర ఎంతంటే..!!

Jio 5g Imresizer

Jio 5g Imresizer

భారత్ లో ఇప్పుడు 5జీ సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రిలయన్స్ జీయో దేశంలోని ప్రజలకు 5జీ నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించింది. 5జీ నెట్ వర్క్ తోపాటుగా తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో బిజీగా ఉంది. అయితే 5జీ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేస్తున్నట్లు జీయో ఇప్పటికే ప్రకటించింది. కొత్త స్మార్ట్‌ఫోన్‌పై గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ఇటీవల జరిగిన 45వ ఏజీఎం సమావేశంలో కంపెనీ తెలిపింది. అయితే, మీడియా నివేదికల ప్రకారం ఇప్పుడు జియో ఈ ఫోన్‌కు సంబంధించిన బయటకు లీక్ అయ్యాయి.

JioPhone 5G ఫీచర్లు:
పలు రిపోర్ట్స్ ప్రకారం జియో కొత్త ఫోన్ కోడ్‌నేమ్ ‘గంగా’గా నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఫోన్ మోడల్ నంబర్ LS1654QB5 ఉండే అవకాశం ఉంది. JioPhone 5G పేరుతో కంపెనీ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ చూసినట్లయితే. డిస్ప్లే- 6.5-అంగుళాల స్క్రీన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌లో HD + LCD డిస్ప్లే చూడవచ్చు. ఈ ఫోన్‌లో 90 Hz రిఫ్రెష్ రేటు కూడా ఉంటుంది. ప్రాసెసర్- జియో ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 480 ప్రాసెసర్‌ని చూడవచ్చు. RAM మెమరీ – 4GB LPDDR4X ర్యామ్ ఈ ఫోన్‌లో ఉంటుంది. కాబట్టి ఫోన్‌లో 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది.

కెమెరా
JioPhone 5G డ్యూయల్ కెమెరా సెటప్‌తో మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది 12 MP ప్రధాన వెనుక కెమెరా 2 MP రెండవ కెమెరాతో రానుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో 8 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ OS- ఆండ్రాయిడ్ 12 ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో రానుంది.

ఇతర ఫీచర్లు-
వైఫై, బ్లూటూత్ 5.1 వంటి కనెక్టివిటీ ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు.

JioPhone 5G ధర
నివేదిక ప్రకారం, కంపెనీ JioPhone 5G ధరను రూ. 10,000 లేదా అంతకంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. అంతేకాదు పలు కథనాల ప్రకారం ఈ ఫోన్ ధర రూ. 8,000 నుండి రూ. 12,000 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.