నేటితో 2024 సంవత్సరం ముగియనుంది. రేపటి నుంచి 2025 సంవత్సరం మొదలుకానుంది. కొత్త సంవత్సరంతో పాటు చాలా రకాల మార్పులు కూడా రాబోతున్నాయి. గ్యాస్ సిలిండర్,ఆధార్ కార్డ్,పాన్ కార్డ్, యూపీఏ పేమెంట్స్ ఇలా ప్రతి ఒక్కదాంట్లో మార్పులు రానున్నాయి. మరి ఈ జనవరి నుంచి ఎలాంటి మార్పులు రాబోతున్నయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రతి నెల ప్రారంభంలో చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. ఈ పరిస్థితిలో గత కొన్ని నెలలుగా గృహావసరాల గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేకపోగా, వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ స్థితిలో జనవరిలో గ్యాస్ సిలిండర్ ధరల్లో పెనుమార్పు ఉండవచ్చని అంటున్నారు. అంటే పెరగవచ్చు లేదా తగ్గవచ్చు అని తెలుస్తోంది.
అలాగే పిఎఫ్ ఖాతాలో జమ అయిన డబ్బు ఉద్యోగులు తమ అవసరాలకు వినియోగించుకోవాలి అంటే పర్మిషన్ కోసం ఎదురు చూడాలి. కానీ ఇకమీదట అలాంటి టెన్షన్ ఉండదట. ఎందుకంటే EPFO త్వరలో కొత్త ఫీచర్ ను పరిచయం చేయబోతోంది. ఇక్కడ ఉద్యోగులు తమ ఖాతాల నుండి ఉపసంహరణలను స్వీయ అధికారం చేసుకోవచ్చు. అంటే ఉద్యోగే స్వయంగా ఆమోదం పొందేలా చేసుకోవచ్చట.
అలాగే జనవరి నుంచి చాలా రకాల కార్లపై ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే ఆ విషయాన్ని ఆయా సంస్థలు అధికారికంగా కూడా ప్రకటించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా సహా ప్రధాన కంపెనీలు తమ వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచబోతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌లో చాలా కొత్త రూల్స్ రాబోతున్నాయి. అంటే మీరు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ని ఉపయోగించి రెండు టీవీలలో మాత్రమే ప్రసారం చేసుకోవచ్చు. మూడవ వ్యక్తి అదే ఖాతాను ఉపయోగించి మరొక టీవీలో ప్రసారం చేయాలనుకుంటే, అతను అదనపు సభ్యత్వాన్ని చెల్లించాల్సి ఉంటుందట.
UII 123 చెల్లింపు లావాదేవీ పరిమితి పెంచింది. గతంలో యూపీఐ 123 పే రూ.5,000 కే పరిమితం కాగా ఇప్పుడు దాన్ని రూ.10,000కు పెంచారు. జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుందట.