James Web Telescope: సరికొత్త లుక్ లో కనిపిస్తున్న యురేనస్ గ్రహం.. ఫొటోస్ వైరల్?

ఈ అనంత విశ్వంలో, విశ్వంలోని ఎన్నో విషయాలను తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తూనే

  • Written By:
  • Publish Date - April 7, 2023 / 04:28 PM IST

ఈ అనంత విశ్వంలో, విశ్వంలోని ఎన్నో విషయాలను తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఈ అనంత విశ్వం 100% ఉంటే మనం అందులో కనుగొన్నది కేవలం 10 శాతం మాత్రమే. ఇకపోతే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు ఎప్పటికప్పుడు విశ్వంలోని అనేక అద్భుతాలను మన ముందు ఉంచుతోంది. హబుల్ టెలిస్కోప్ తో పోలిస్తే చాలా శక్తివంతమైన టెలిస్కోప్ అయినా జేమ్స్ వెబ్ విశ్వంలోని మూలాలను ఖగోళ అద్భుతాలను శాస్త్రవేత్తలకు అందిస్తోంది.

ఇప్పటికే విశ్వం పుట్టుక అత్యంత పురాతనమైన గెలాక్సీలు నక్షత్రాల పుట్టుక బ్లాక్ హోల్స్ ఇలా ఎన్నో వాటి గురించి భూమికి పంపించిన విషయం తెలిసింది. విశ్వ రహస్యాలను చేజించడం కోసం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి ఒక అద్భుతమైన ఫోటోతో జేమ్స్ వెబ్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. అదేమిటంటే సౌర వ్యవస్థలో మూడవ అతిపెద్ద గ్రహం అయిన యురేనస్ గ్రహాన్ని తన కెమెరాలతో బంధించింది. అయితే గతంలో ఎప్పుడు కూడా యురేనస్ గ్రహాన్ని అంత స్పష్టంగా చూసింది లేదు. ఆ యురేనస్ గ్రహం చుట్టూ ఉన్న వలయాలతో పాటు దాని చంద్రులను కూడా క్లిక్ చేసింది.

 

మొదటిసారిగా 1986లో వయోజర్ 2 స్పేస్ క్రాఫ్ట్ యురేనస్ కు సంబంధించిన క్లియర్ ఇమేజెస్ ని పంపించింది. ఈ యురేనస్ గ్రహం చాలా ప్రత్యేకమైన గ్రహం అని చెప్పవచ్చు. ఇది తన చుట్టూ తాను 90 డిగ్రీల కోణంలో తిరుగుతూ సూర్యుడు చుట్ట ఒక చుట్టు తిరగడానికి 84 ఏళ్లు పడుతుంది. జేమ్స్ వెబ్ తెలుసుకోపీ గ్రహాన్ని 12 నిమిషాల పాటు పరిశీలించి యురేనస్ తో పాటు దాని 27 ఉపగ్రహాల్లో ఆరెంటీనే చిత్రీకరించింది. టెలిస్కోప్ నియర్ ఇన్ ఫ్రారెడ్ కెమెరాతో యురేనస్ ఫోటోని తీసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.