Site icon HashtagU Telugu

Instagram Lottery: రీల్స్ చూశాడు.. బగ్ పట్టాడు..38 లక్షలు కొట్టాడు!!

Instagram Imresizer

Instagram Imresizer

ఇన్నోవేషన్ అంటే ఇదే..

ఇతరుల సమస్యలు పరిష్కరించే క్రియేటివిటీ అంటే ఇదే..

జాక్ పాట్ కొట్టడం అంటే ఇదే..

ఈ మాటలన్నీ రాజస్థాన్​ లోని
జైపూర్​కు చెందిన విద్యార్థి నీరజ్ ని ఉద్దేశించినవి. అతడు సాధించిన విజయాన్ని అద్దం పట్టేవి.నీరజ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాదు. మనలాగే ఒక సాధారణ ఇన్ స్టాగ్రామ్ యూజ‌ర్.
అందరిలాగే రీల్స్ చూసి.. ఆనందించి.. లైక్ లు కొట్టేవాడు. ఈక్రమంలో 2021 డిసెంబర్​లో రీల్స్ సెగ్మెంట్​లో ఒక సాంకేతిక లోపాన్ని గుర్తించాడు. మనం చేసిన రీల్స్​కు పెట్టే థంబ్​నెయిల్​ను పాస్​వర్డ్​ అవసరం లేకుండా హ్యాకర్లు ఈజీగా ఈ బగ్ ద్వారా మార్చేసే ఛాన్స్ ఉందని నీరజ్ గుర్తించాడు.దాన్ని నిరూపించేందుకు నెల రోజుల పాటు కష్టపడ్డాడు. చివరికి 2022
జ‌న‌వ‌రి 31న సాంకేతికంగా బ‌గ్ ను పూర్తి స్థాయిలో గుర్తించాడు.
వెంటనే దీనిపై ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​కు సమాచారం అందించాడు. ఈ బగ్ నిజమేనని నిర్ధరించిన ఫేస్​బుక్ టీమ్ డెమో షేర్​ చేయమని అడిగింది. వెంటనే నీరజ్ ఓ రీల్​థంబ్​నెయిల్​ను ఐదు నిమిషాల్లో మార్చి వారికి చూపించాడు.

కొన్ని రోజుల తర్వాత..

కొన్ని రోజుల తర్వాత నీరజ్​కు ఫేస్​బుక్ అధికారిక మెయిల్ ఐడీ నుంచి ఓ మెయిల్​ వచ్చింది. బగ్ గుర్తించినందుకు గానూ అతనికి $45,000 (సుమారు రూ. 35 లక్షలు) రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. 2022 మే నెల‌లో రివార్డ్ ఇస్తామ‌న్న ఫేస్ బుక్.. నాలుగు నెల‌ల త‌ర్వాత ఇచ్చింది. ఇందుకు మూడు ల‌క్ష‌లు బోన‌స్ కూడా ఇచ్చింది. సరదాగా కాలక్షేపం కోసం ఉపయోగించిన ఇన్ స్టాగ్రామ్ తనకు లక్షల రూపాయలు తెచ్చి పెట్టడంతో నీరజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ కొన్ని బగ్స్ ఉంటాయి. వాటిని కనిపెట్టిన వారికి సదరు కంపెనీలు ఈవిధంగా భారీ మొత్తాన్ని చెల్లిస్తాయి.

Exit mobile version